Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సునీల్ నరైన్ బౌలింగ్ దూస్రా అదుర్స్.. టెక్నాలజీకి కూడా..?

సునీల్ నరైన్ బౌలింగ్ దూస్రా అదుర్స్.. టెక్నాలజీకి కూడా..?
, సోమవారం, 22 సెప్టెంబరు 2014 (15:19 IST)
వెస్టిండీస్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న భారత సంతతి స్పిన్నర్ సునీల్ నరైన్ గొప్పదనమేంటో అతన్నెదుర్కొన్న బ్యాట్స్ మెన్‌ను అడిగితే చెబుతారు. దూస్రాలను మించిన డెలివరీలతో మేటి బ్యాట్స్ మెన్‌కు సైతం ముకుతాడు వేయడం ఈ యువకుడికే చెల్లింది. 
 
క్యారమ్ బాల్ అస్త్రానికి మరిన్ని మెరుగులు దిద్దిన నరైన్, ఇప్పుడు హార్డ్ హిట్టర్ల పాలిట యముడయ్యాడు. వేలికొసలతో బంతి గమనాన్ని నిర్దేశించడం నరైన్ స్పెషాలిటీ. అతని బౌలింగ్ లోని వైవిధ్యాన్ని లేటెస్ట్ టెక్నాలజీ సైతం విశ్లేషించలేకపోతోంది. 
 
మామూలుగా వేళ్ళసాయంతో బంతిని తిప్పడం స్పిన్నర్లందరూ చేసేదే. కానీ, నరైన్ స్టయిలే వేరు. వేలికొసలతో అనూహ్యంగా బంతిని టాప్ స్పిన్ చేస్తాడు. దీంతో, బ్యాట్స్ మెన్ అయోమయానికి గురవుతారు. 
 
కోల్ కతా నైట్ రైడర్స్ తరపున సీఎల్ టి20 టోర్నీలో ఆడుతున్న నరైన్ ఇప్పటికే ప్రత్యర్థులకు హెచ్చరికలు జారీ చేశాడు. రెండు మ్యాచ్ లాడి 4 వికెట్లతో సత్తా చాటాడు. టి20 క్రికెట్లో మెయిడెన్ ఓవర్ విసరడం ఎంతో అరుదు, కాగా, నరైన్ బంతినందుకుంటే అలాంటి మెయిడెన్లు ఎన్నో వస్తాయి.

Share this Story:

Follow Webdunia telugu