Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఛాంపియన్స్ లీగ్ : డాల్ఫిన్స్‌కు చెన్నై షాక్, రైనా @5000, రికార్డ్

ఛాంపియన్స్ లీగ్ : డాల్ఫిన్స్‌కు చెన్నై షాక్, రైనా @5000, రికార్డ్
, మంగళవారం, 23 సెప్టెంబరు 2014 (13:47 IST)
చాంపియన్స్ లీగ్ టి-20 క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా సోమవారం డాల్ఫిన్‌తో తలపడిన చెన్నై సూపర్ కింగ్స్ రెచ్చిపోయింది. ఈ టోర్నీలో అత్యధికంగా ఒటాగో సాధించిన 242 పరుగుల స్కోరును సమం చేసింది. 
 
సురేష్ రైనా 90 పరుగులు చేసి చెన్నై భారీ స్కోరులో కీలక పాత్ర పోషించాడు. కాగా, 243 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైన డాల్ఫిన్ 188 పరుగులు చేసి ఆలౌటైంది. ఓపెనర్లు కామెరాన్ డెల్‌పోర్ట్, మోర్న్ వాన్ విక్ ధాటిగా ఆడినప్పటికీ, ఆతర్వాత పరుగుల వేటలో డాల్ఫిన్స్ విఫలమై 54 పరుగుల తేడాతో ఓడింది. 
 
డాల్ఫిన్ ఆహ్వానంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లకు 242 పరుగులు సాధించింది. పెర్త్ స్కార్చర్స్‌పై 2013 సెప్టెంబర్ 12న జైపూర్‌లో జరిగిన మ్యాచ్‌లో ఒటాగో కూడా ఇదే స్కోరు చేసింది. అయితే, ఒటాగో కేవలం నాలుగు వికెట్లు కోల్పోతే, ధోనీ నాయకత్వంలో చెన్నై ఆరు వికెట్లు చేజార్చుకుంది. 
 
(ఓపెనర్ బ్రెండన్ మెక్‌కలమ్ 49 పరుగులు) ఫఫ్ డు ప్లెసిస్ 30 పరుగులు మెరుగైన ఆటతో ఆకట్టుకున్నారు. రైనా 43 బంతులు ఎదుర్కొని, నాలుగు ఫోర్లు, ఎని మిది భారీ సిక్సర్లతో 90 పరుగులు చేశాడు. చివరిలో రవీంద్ర జడేజా, అశ్విన్ నాటౌట్‌గా నిలిచారు. 
జడేజా 9 బంతుల్లో 11 పరుగులు చేస్తే, అశ్విన్ 14 బంతుల్లోనే 40 పరుగులు సాధించాడు. ఈ స్కోరులో మూడు ఫోర్లు, మరో మూడు సిక్సర్లున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu