Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అడిలైడ్ టెస్టులో కోహ్లీ సెంచరీ వృధా, భారత్ ఓటమి... ఆస్ట్రేలియా గెలుపు!

అడిలైడ్ టెస్టులో కోహ్లీ సెంచరీ వృధా, భారత్ ఓటమి... ఆస్ట్రేలియా గెలుపు!
, శనివారం, 13 డిశెంబరు 2014 (12:58 IST)
అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో ఒంటరి పోరాటం చేసిన కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన రెండు సెంచరీలు వృధా అయ్యాయి. దీంతో ఆస్ట్రేలియా జట్టు 48 పరుగుల తేడాతో విజయభేరీ మోగించి, బౌన్సర్ బంతికి అకాల మరణం చెందిన యువ క్రికెటర్ ఫిలిప్ హ్యూస్‌కు అంకితం చేసింది. 
 
364 పరుగులు విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ జట్టు తన రెండో ఇన్నింగ్స్‌లో 315 పరుగులకు ఆలౌట్ అయింది. చివరి ఐదు వికెట్లు కేవలం 16 పరుగుల తేడాతో పడిపోవడం గమనార్హం. దీంతో ఆస్ట్రేలియా 48 పరుగులతో విజయభేరీ మోగించింది. భారత ఇన్నింగ్స్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండు ఇన్నింగ్స్‌లలో సెంచరీలు కొట్టగా, రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్ మురళీ విజయ్ 99 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. 
 
ముఖ్యంగా కోహ్లీ ఔట్ అయిన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన భారత్ బ్యాట్స్‌మెన్లలో ఏ ఒక్కరు కూడా నిలదొక్కుకోలేక పోయారు. ఫలితంగా లక్ష్యఛేదనలో భారత్ మరోమారు చేతులెత్తేసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో లియోన్‌ రెండో ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు పడగొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు. అలాగే, ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్లలో ఓపెనర్ డేవిడ్ వార్నర్ రెండు ఇన్నింగ్స్‌లలో సెంచరీలు చేసి రికార్డు సృష్టించాడు. 
 
టెస్ట్ మ్యాచ్ సంక్షిప్త స్కోరు. 
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ : 517/7 డిక్లేర్
(డేవిడ్ వార్నర్ 145, క్లార్క్ 128, స్మిత్ 162 నాటౌట్)
భారత్ తొలి ఇన్నింగ్స్ : 444 ఆలౌట్
(విరాట్ కోహ్లీ 115, పుజరా 73, మురళీ విజయ్ 53)
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ : 290/5 డిక్లేర్
(డేవిడ్ వార్నర్ 102, స్మిత్ 52 నాటౌట్)
భారత్ రెండో ఇన్నింగ్స్ : 315 ఆలౌట్
(విరాట్ కోహ్లీ 141, మురళీ విజయ్ 99)
ఫలితం : 48 రన్స్ తేడాతో ఆస్ట్రేలియా విజయం.

Share this Story:

Follow Webdunia telugu