Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యువీకి ఇష్టమైన కెప్టెన్ ధోనీ కాదట.. మరెవరో తెలుసా?

యువీకి ఇష్టమైన కెప్టెన్ ధోనీ కాదట.. మరెవరో తెలుసా?
, శనివారం, 25 అక్టోబరు 2014 (12:27 IST)
టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. యువరాజ్ సింగ్ ఫేవరెట్ కెప్టెన్ కాదట. క్యాన్సర్ నుంచి కోలుకున్న టీమిండియాలోకి వస్తూపోతూ వున్న యువీకి ధోనీ ఫేవరేట్ కాదని.. గంగూలీనే తనకిష్టమైన కెప్టెన్ అని యువీ చెప్పాడు. 
 
టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సమర్థవంతంగా రాణిస్తున్నాడని, జట్టు సాధించిన ఎన్నో విజయాల్లో అతనిది కీలక పాత్ర కితాబిచ్చిన యువీ... గంగూలీ మాత్రమే తనకు ఇష్టమైన కెప్టెన్ అని పేర్కొన్నాడు. 
 
గంగూలీ నుంచి ఎంతో నేర్చుకున్నానని యువరాజ్ సింగ్ చెప్పుకొచ్చాడు. దాదా సారథ్యంలోనే తన కెరీర్ వికసించిందన్నాడు. విదేశీ గడ్డపై కూడా గెలవగలమన్న నమ్మకం జట్టులో పాదుకొనడానికి గంగూలీయే కారణమన్నాడు. 
 
ఇక, టీమిండియా మాజీ కోచ్ గ్యారీ కిర్ స్టెన్‌ను కూడా యువీ ప్రశంసల వర్షంలో ముంచెత్తాడు. గ్యారీ హయాంలో తాను బాగా రాణించానని, అతనో గొప్ప కోచ్ అని కితాబిచ్చాడు. 

Share this Story:

Follow Webdunia telugu