Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిల్ హ్యూగ్స్‌ తలకి గాయం.. సీరియస్!

ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిల్ హ్యూగ్స్‌ తలకి గాయం.. సీరియస్!
, మంగళవారం, 25 నవంబరు 2014 (16:01 IST)
ఆస్ట్రేలియన్ క్రికెటర్ ఫిల్ హ్యూగ్స్ (25) సిడ్నీ స్టేడియంలో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో హ్యూగ్స్ పరిస్థితి విషమంగా ఉందని, ఆతను కోమాలోకి వెళ్లిపోయినట్లు డాక్టర్లు చెబుతున్నారు. 
 
ఒక స్థానిక క్రికెట్ జట్టుతో మ్యాచ్ ఆడుతూ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బంతి బౌన్స్ అయి హెల్మెట్‌లోనుంచి దూసుకెళ్లడంతో హ్యూగ్స్ తలకి గాయం తగిలింది. దీంతో హ్యూగ్స్ గ్రౌండ్‌లోనే కుప్పకూలిపోయాడు. బంతి తగిలిన కారణంగా ఆయన తలకు తీవ్ర గాయమైంది. ప్రస్తుతం ఆయనకు చికిత్స చేస్తున్నారు. 
 
బంతి తగిలిన కొద్ది క్షణాలకే కుప్పకూలిపోయి ఫిల్ హ్యూగ్స్  కోమాలోకి వెళ్ళిపోయారు. ఆయనను తక్షణం హెలికాప్టర్లో ఆస్పత్రికి తరలించి, శస్త్రచికిత్స చేశారు.
 
ఈ ఘటన జరిగిన సమయంలో ఫిల్ హ్యూగ్స్ తల్లి, సోదరి క్రికెట్ గ్రౌండ్లోనే ఉన్నారు. ఫిల్ హ్యూగ్స్ ఇప్పటివరకూ 25 టెస్ట్ మ్యాచ్లు ఆడారు. టెస్ట్ క్రికెట్లో పదో వికెట్కు 163 పరుగుల భాగస్వామ్యం అందించి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. 

Share this Story:

Follow Webdunia telugu