Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఫిలిప్ హ్యూస్‌ తీవ్ర గాయానికి కారణం.. పాత హెల్మెట్టే: మసూరి

ఫిలిప్ హ్యూస్‌ తీవ్ర గాయానికి కారణం.. పాత హెల్మెట్టే: మసూరి
, బుధవారం, 26 నవంబరు 2014 (19:03 IST)
ప్రముఖ ఆస్ట్రేలియన్ క్రికెటర్ ఫిలిఫ్ హ్యూస్ దారుణంగా గాయపడటానికి పాత హెల్మెట్టే కారణమని మసూరి తెలిపింది. తలకు గాయం తగలడం పాత హెల్మెట్ ధరించడంతోనేనని మసూరి వెల్లడించింది. సిడ్నీ స్టేడియంలో క్రికెట్ ఆడుతూ బంతి తలకు తగలడం వల్ల ఫిలిఫ్ కోమాలోకి వెళ్ళిపోయారు. ఇందుకు పాత హెల్మెట్ వాడటమే కారణమని మసూరి తెలిపింది. 
 
ఆస్ట్రేలియా బ్యాట్స్ మన్ ఫిలిప్ హ్యూస్ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ ఘటన యావత్తు ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. బౌన్సర్ తలకు తగలడంతో తీవ్రంగా గాయపడిన హ్యూస్.. కోమాలోకి వెళ్లిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. 
 
అయితే హ్యూస్ హెల్మెట్ ధరించినా అతడికి గాయం కావడంపై ఇప్పుడు బ్యాట్స్ మెన్ భద్రతపై చర్చ జరుగుతోంది. దీనిపై, ప్రఖ్యాత క్రికెట్ హెల్మెట్ తయారీదారు 'మాసురి' స్పందించింది. హ్యూస్ వాడింది పాత మోడల్ హెల్మెట్ అని తెలిపింది. 
 
తమ కొత్త మోడల్ హెల్మెట్‌ను ధరించి ఉంటే హ్యూస్ గాయపడేవాడు కాదని అభిప్రాయపడింది. అభివృద్ధి పరిచిన కొత్త మోడల్ హెల్మెట్ బ్యాట్స్ మెన్‌కు మెరుగైన రక్షణ కల్పిస్తుందని 'మాసురి' వర్గాలు వివరించాయి. 
 
బ్రిటన్‌కు చెందిన 'మాసురి' క్రికెట్ రక్షణ ఉపకరణాల తయారీలో ప్రసిద్ధిగాంచింది. హ్యూస్‌కు తల వెనుక మెడ భాగంలో బలంగా దెబ్బ తగిలిందని, ఆ భాగాన్ని హెల్మెట్లు పూర్తిగా కవర్ చేయలేకపోతున్నాయని 'మాసురి' పేర్కొంది. హ్యూస్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu