Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారత యువ క్రికెటర్లకు ఇదో మంచి ఛాన్స్ : ద్రవిడ్

భారత యువ క్రికెటర్లకు ఇదో మంచి ఛాన్స్ : ద్రవిడ్
, మంగళవారం, 26 ఆగస్టు 2014 (18:01 IST)
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో టీమిండియా ఖంగుతిన్న నేపథ్యంలో ఐదు వన్డేల సిరీస్ ద్వారా భారత యువ క్రికెటర్లకు మంచి అవకాశం లభించిందని బ్యాటింగ్ ఐకాన్ రాహుల్ ద్రవిడ్ అభిప్రాయపడ్డాడు. వన్డే వరల్డ్ కప్‌కు టీమిండియాలో బెర్తులు దక్కించుకోవాలంటే కుర్రాళ్ళు ఈ సిరీస్‌లో రాణించడం అత్యావశ్యకమని పేర్కొన్నాడు. 
 
వరల్డ్ కప్ సన్నాహకాల దృష్ట్యా ఇంగ్లండ్‌తో సిరీస్ చాలా ముఖ్యమైనదని ద్రవిడ్ సూచించాడు. అందుచేత క్రికెటర్లు బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ మెరుగ్గా రాణింటేందుకు సాయశక్తులా ప్రయత్నించాలన్నాడు. 
 
చాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన తర్వాత విదేశాల్లో మనవాళ్ళ ప్రదర్శన పేలవంగా ఉందన్న ఈ కర్ణాటక క్రికెటర్, పర్యటనను విజయంతో ముగించాలని సూచించాడు. అయితే, వరల్డ్ కప్ సమీపిస్తున్న తరుణంలో వ్యక్తిగతంగా రాణించేందుకు యువ క్రికెటర్లు ఈ ఛాన్సును సద్వినియోగం చేసుకోవాలన్నాడు. 
 
ఇక, ఈ సిరీస్‌లో సురేశ్ రైనా, సంజు శాంసన్, అంబటి రాయుడు వంటి యువకులతో జట్టులో తాజాదనం కనిపిస్తోందని, జట్టుకు అది లాభిస్తుందని ద్రావిడ్ అభిప్రాయపడ్డాడు.

Share this Story:

Follow Webdunia telugu