Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆసీస్ టూర్‌లో భారత్‌కు రెండో ఓటమి...! ఆస్ట్రేలియా ఘన విజయం..!

ఆసీస్ టూర్‌లో భారత్‌కు రెండో ఓటమి...! ఆస్ట్రేలియా ఘన విజయం..!
, శనివారం, 20 డిశెంబరు 2014 (12:15 IST)
బ్రిస్బేన్‌లో భారత్ - ఆస్టేలియా మధ్య జరిగిన రెండో టెస్ట్‌లో భారత బ్యాట్స్‌మెన్ల వైఫల్యంతో ఆస్టేలియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా నాలుగు వికెట్ల తేడాతో గెలుపొంది తమకు తిరుగులేదని నిరూపించుకుంది.
 
ఈ మ్యాచ్ ఆరంభంలో 128 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ చేప్టటిన ఆసీస్ రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినట్లు కనిపించింది. అయితే ఓపెనర్ రోజర్స్(55) పరుగులతో రాణించడంతో ఆసీస్ కుదుటపడింది.
 
అంతకుమందు ఆసీస్ డేవిడ్ వార్నర్ (6), షేన్ వాట్సన్ (0) లను పెవిలియన్ కు పంపిన ఇషాంత్ శర్మ అదే ఊపును కొనసాగించడంతో రోజర్స్ కూడా అవుటయ్యాడు. ఆ తరువాత కెప్టెన్ స్టీవెన్ స్మిత్(28)పరుగులు చేసి రనౌట్ కాగా  హడిన్ (1) కూడా వెనుతిరిగాడు. 122 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయిన ఆసీస్.. ఇంకా ఒక రోజు ఆట మిగిలి ఉండగానే విజయం సాధించింది. నాల్గో రోజు ఆటలో టీమిండియా పూర్తి స్థాయిలో వైఫల్యం చెందింది .
 
వికెట్టు నష్టానికి 71 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా వరుస వికెట్లను కోల్పోయింది. లంచ్ సమయానికే ఏడు వికెట్లను నష్టపోయిన టీమిండియా ఒక్కసారిగా కుదేలుపడింది. అజ్యింకా రహానే (10) పరుగులు చేసి పెవిలియన్ చేరగా, రోహిత్ శర్మ, కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ డకౌట్ లుగా వెనుదిరిగి టీమిండియా ఆశలపై నీళ్లు చల్లారు. అనంతరం ఓపెనర్ శిఖర్ కు ఉమేశ్ యాదవ్ జతకలిసి కాసేపు కునికిపాట్లు పడ్డాడు. 
 
ఇరువురూ కలిసి 60 పరుగుల పాట్నర్‌షిప్ నమోదు చేయడంతో టీమిండియాకు కాస్త ఊరట లభించింది. ఉమేశ్ యాదవ్ ను అవతలి ఎండ్ లో ఎక్కువ సమయం ఉంచిన శిఖర్ థావన్ చక్కటి ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. ఉమేశ్ యాదవ్ (30) పరుగులు చేసి చివరి వికెట్టుగా పెవిలియన్ చేరాడు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 408 పరుగులు, సెకెండ్ ఇన్నింగ్స్ లో 224 పరుగులు చేసింది. ఆసీస్ తన తొలి ఇన్నింగ్స్ లో  505 పరుగులు చేసింది. దీంతో ఆసీస్ కు 2-0 ఆధిక్యత లభించింది.

Share this Story:

Follow Webdunia telugu