Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

16 నుంచి అహ్మదాబాద్‌లో భారత్-లంక తొలి టెస్టు!

16 నుంచి అహ్మదాబాద్‌లో భారత్-లంక తొలి టెస్టు!
, సోమవారం, 9 నవంబరు 2009 (10:13 IST)
భారత్‌లో మరో క్రికెట్ సమరానికి తెరలేవనుంది. ప్రస్తుతం జరుగుతున్న భారత్-ఆస్ట్రేలియా సమరం ఈనెల 11వ తేదీతో ముగియనుంది. ఆ తర్వాత 16వ తేదీ నుంచి మరో క్రికెట్ పోరు ఆరంభమవుతుంది. ఈ సమరంలో భారత్, శ్రీలంక జట్లు తలపడతాయి. ఇందుకోసం కుమార సంగక్కర నేతృత్వంలోని లంక జట్టు ఇప్పటికే భారత్‌కు చేరుకుంది.

ఈ పర్యటన ఈనెల 11వ తేదీన బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్‌తో ముంబైలో జరిగే వార్మప్ మ్యాచ్‌తో లంక శ్రీకారం చుడుతుంది. ఆ తర్వాత తొలి టెస్టు అహ్మదాబాద్‌, రెండో టెస్టు కాన్పూర్, మూడో టెస్టు ముంబైలో జరుగుతుంది. ఈ షెడ్యూల్ ఇలా వుంది.

నవంబర్‌ 11వ తేదీ: ముంబైలో ప్రాక్టీస్ మ్యాచ్.
నవంబర్‌ 16-20: అహ్మదాబాద్‌లో తొలి టెస్టు.
నవంబర్‌ 24-28: కాన్పూర్‌లో రెండో టెస్టు.
డిసెంబర్‌ 2-6: ముంబైలో మూడో టెస్టు.
డిసెంబర్‌ 9: నాగ్‌పూర్‌లో తొలి ట్వంటీ-20
డిసెంబర్‌ 12: మొహాలీలో రెండో ట్వంటీ-20.

డిసెంబర్‌ 15: రాజ్‌కోట్‌లో తొలి వన్డే.
డిసెంబర్‌ 18: విశాఖపట్నంలో రెండో వన్డే.
డిసెంబర్‌ 21: కటక్‌లో మూడో వన్డే.
డిసెంబర్‌ 24: కోల్‌కతాలో నాలుగో వన్డే.
డిసెంబర్‌ 27: న్యూఢిల్లీలో ఐదో వన్డే.

Share this Story:

Follow Webdunia telugu