Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్పాట్ ఫిక్సింగ్: సస్పెన్షన్‌పై సల్మాన్ భట్, ఆసిఫ్‌ల అప్పీలు

స్పాట్ ఫిక్సింగ్: సస్పెన్షన్‌పై సల్మాన్ భట్, ఆసిఫ్‌ల అప్పీలు
FILE
ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొని, జైలు శిక్షను కూడా అనుభవించి విడుదలైన పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్, ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ ఆసిఫ్ తమపై విధించిన సస్పెన్షన్‌పై క్రీడాల మధ్యవర్తిత్వ కోర్టును ఆశ్రయించనున్నారు. వీరిద్దరితోపాటు మరో ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ ఆమీర్‌ను కూడా స్పాట్ ఫిక్సింగ్ కేసులో దోషిగా క్రౌన్ కోర్టు నిర్ధారించిన సంగతి తెలిసిందే.

2011లో నిషేధం వేటు పడిన తర్వాత వీరిద్దరూ ఎంత ప్రయత్నించినా దాని నుంచి విముక్తి పొందలేకపోయారు. ఫలితంగా అంతర్జాతీయ క్రీడా మధ్యవర్తిత్వ కోర్టులో అప్పీలు చేయాలని నిర్ణయించుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu