Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సత్తా చాటిన బోలింగర్: ఆసీస్‌ ఖాతాలో రెండో విజయం!

సత్తా చాటిన బోలింగర్: ఆసీస్‌ ఖాతాలో రెండో విజయం!
FILE
ఆస్ట్రేలియా పేసర్ బోలింగర్ తన సత్తా చాటడంతో వెస్టిండీస్‌పై ఆస్ట్రేలియా రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. అడిలైడ్‌లో వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా 8వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ 39.4 ఓవర్లలో 170 పరుగులకే ఆలౌటైంది. బోలింగర్‌ నాలుగు వికెట్లు తీసి విండీస్‌ను కుప్పకూల్చాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ 26.3 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి సునాయాసంగా గెలుపొందింది.

వాట్సన్ (57), రికీ పాంటింగ్ (57)ల అర్థ సెంచరీలు జట్టును గెలిపించాయి. పాంటింగ్ 55 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 57 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అలాగే వాట్సన్ 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 53 పరుగులు సాధించాడు.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్.. బోలింగర్ ధాటికి 39.4 ఓవర్లలో 170 పరుగులకే ఆలౌట్ అయ్యింది. స్మిత్ (43), పొలార్డ్ (32), రామ్‌దిన్ (30)లు మాత్రమే వెస్టిండీస్ క్రికెటర్లలో రాణించారు. మ్యాచ్ తొలి బంతికే వెస్టిండీస్ క్రిస్ గేల్ అవుట్ కావడంతో ఆ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది.

దీంతో ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఆసీస్‌కు రెండో విజయంతో 2-0 పాయింట్ల ఆధిక్యాన్ని సంపాదించుకుంది. ఇకపోతే.. మూడో వన్డే ఈ నెల 12వ తేదీన సిడ్నీలో జరుగనుంది.

Share this Story:

Follow Webdunia telugu