పాకిస్తాన్‌లోని లాహోర్‌లో మంగళవారం శ్రీలంక క్రికెట్ జట్టు ప్రయాణిస్తున్న బస్సుపై 12 మంది సాయుధలైన తీవ్రవాదులు జరిపిన గ్రెనేడ్ దాడులలో గాయపడిన జట్టు సభ్యుల పరిస్థితిని వైస్‌కెప్టెన్ కుమార్ సంగక్కర ఓ మీడియా సంస్థకు ఫోనులో వెల్లడించారు.
మహేలా జయవర్ధనెకు కాలి మడమవద్ద గాయం అయింది. ఇది చిన్న గాయమే. కుమార్ సంగక్కరకు భుజం వద్ద కోసుకుపోయింది. అయితే ఇది కూడా తీవ్రమైన గాయం కాదు. అజంతా మెండిస్‌కు వీపు భాగంలో గాయమైంది. ఇది కూడా తీవ్రమైన గాయం కాదు.
తరంగ పరనవితణకు ఛాతీపై గాయమైంది. చిన్న గాయమైనప్పటికీ అతడిని వైద్యశాలకు తరలించారు. తిలాన్ సమరవీర కాలికి పెద్ద గాయమే అయింది. అయితే మరీ తీవ్రమైన గాయం మాత్రం కాదు. ఇతడినీ వైద్యశాలకు తరలించారు. జట్టు అసిస్టెంట్ కోచ్ అయిన పాల్ ఫార్బ్రేస్‌కి చేతిపై గాయమైంది. ఇది కూడా చిన్న గాయమేనని సంగక్కర తెలిపాడు.