Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వన్డే ప్రపంచకప్: మోర్గాన్ స్థానంలో పెరీరాకు స్థానం!

వన్డే ప్రపంచకప్: మోర్గాన్ స్థానంలో పెరీరాకు స్థానం!
FILE
భారత ఉపఖండంలో ఫిబ్రవరి 19వ తేదీన ప్రారంభం కానున్న పదో ప్రపంచకప్‌లో ఆడే ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు నుంచి ఇయాన్ మోర్గాన్ గాయంతో తప్పుకున్నాడు. 24 ఏళ్ల బ్యాట్స్‌మెన్ ఇయాన్ మోర్గాన్‌‌కు ఎడమచేతి మధ్య వేలు ఫ్రాక్చర్ కావడంతో వన్డే ప్రపంచకప్‌లో ఆడే మోర్గాన్ ఆశలు అడియాసలైయ్యాయి.

చేతివేలి గాయం నుంచి ఇంకా కోలుకోని ఇయాన్ మోర్గాన్‌, ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు తరపున వన్డే ప్రపంచకప్‌లో ఆడే అవకాశాన్ని కోల్పోయాడు. తద్వారా ఇయాన్ మోర్గెన్ స్థానంలో రవి పెరీరాకు స్థానం కల్పించినట్లు సెలక్టర్లు తెలిపారు.

కాగా, ఆసిస్‌తో ఇటీవల ముగిసిన వన్డే సిరీస్‌లో ధీటుగా రాణించలేకపోయిన ఇంగ్లాండ్‌ జట్టు నుంచి మోర్గాన్ తప్పుకోవడం గట్టి దెబ్బేనని క్రీడా విశ్లేషకులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu