Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రియాతో రొమాన్స్ చేస్తున్నానా? అవన్నీ వదంతులే!: శ్రీశాంత్

రియాతో రొమాన్స్ చేస్తున్నానా? అవన్నీ వదంతులే!: శ్రీశాంత్
బాలీవుడ్ తార రియాసేన్‌తో రొమాన్స్ చేస్తున్నట్లు వస్తున్న వార్తలను కేరళ స్పీడ్‌స్టర్ శ్రీశాంత్ కొట్టిపారేశాడు. రియాసేన్ మంచి స్నేహితురాలు మాత్రమేనని, రియాతో వేరే సంబంధాలు లేవని శ్రీశాంత్ అన్నాడు. ప్రస్తుతం ఆటమీద దృష్టి కేంద్రీకరిస్తున్నానని, త్వరలో పెద్దల కుదిర్చిన పెళ్లి చేసుకుంటానని శ్రీ స్పష్టం చేశాడు.

దక్షిణ భారత దేశంలోని సంప్రదాయ కుటుంబాలు ఎలా ఉంటాయో అందరికీ తెలుసునని, అందువల్ల ప్రేమ పెళ్లి కాకుండా పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటానని శ్రీశాంత్ అంటున్నాడు.

తన కుటుంబం తన కోసం పెళ్లి కూతుర్ని వెతుకుతున్నారని శ్రీ చెప్పాడు. తల్లిదండ్రులు పెళ్లిచేసుకోమని ఒత్తిడి తెస్తున్నారు. చాలా ఆలోచించిన తర్వాత పెళ్లి చేసుకోవాలని తాను నిర్ణయించుకున్నట్లు శ్రీశాంత్ తెలిపాడు. కాగా, ప్రపంచకప్‌ ఫైనల్లో ఆడిన శ్రీశాంత్ ప్రస్తుతం ఐపీఎల్ నాలుగో సీజన్‌లో ఆరంగేట్రం చేసిన కొచ్చి టస్కర్స్ తరపున ఆడుతున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu