Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రిటైర్మెంట్ వార్తలను కొట్టిపారేసిన ఆసీస్ కెప్టెన్ రికీ పాంటింగ్!

రిటైర్మెంట్ వార్తలను కొట్టిపారేసిన ఆసీస్ కెప్టెన్ రికీ పాంటింగ్!
ప్రపంచకప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు స్వస్తి చెబుతున్నానని వస్తున్న వార్తలను ఆస్ట్రేలియన్ క్రికెట్ కెప్టెన్ రికీ పాంటింగ్ కొట్టిపారేశాడు. ప్రపంచకప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పే యోచనలో లేదని పాంటింగ్ తేల్చి చెప్పాడు.

తన ఆటతీరును మెరుగుపరుచుకునేందుకు కృషి చేస్తున్నా. కానీ రిటైర్మెంట్ చేస్తాననే వార్తల్లో నిజం లేదన్నాడు. ప్రస్తుతం క్రికెట్‌ను ఆస్వాదించి ఆడుతున్నాను. భారత్‌తో గురువారం జరుగనున్న మ్యాచ్‌లోనూ ధీటుగా రాణించే దిశగా ప్రయత్నిస్తున్నానని రికీ పాంటింగ్ చెబుతున్నాడు.

కాగా, లండన్‌ ఆధారిత ఓ వార్తాపత్రిక రికీ పాంటింగ్ వరల్డ్ కప్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచురించింది. కెప్టెన్‌గానూ, పరుగుల సాధనలో రికీ పాంటింగ్ విఫలమవుతున్నాడని, తద్వారా తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు స్వస్తి చెప్పే యోచనలో ఉన్నట్లు ఆ పత్రిక వార్తలు ప్రచురించింది. ఈ వార్తలను 36 ఏళ్ల రికీ పాంటింగ్ కొట్టిపారేశాడు.

Share this Story:

Follow Webdunia telugu