Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రిటైర్మెంట్‌ ప్రకటించే యోచన లేదు: తేల్చి చెప్పిన సచిన్!

రిటైర్మెంట్‌ ప్రకటించే యోచన లేదు: తేల్చి చెప్పిన సచిన్!
, మంగళవారం, 5 ఏప్రియల్ 2011 (12:07 IST)
PTI
అంతర్జాతీయ క్రికెట్ నుంచి ప్రకటించే ప్రస్తుతానికి తప్పుకునే యోచన లేదని భారత స్టార్ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ స్పష్టం చేశాడు. క్రికెట్ ఆటను ఆస్వాదిస్తున్నంతకాలం దేశానికి సేవలు అందించడానికి తాను సిద్ధంగా ఉంటానని మాస్టర్ చెప్పాడు.

క్రికెట్‌లో కొనసాగాలన్న కోరిక తనలో ఇంకా సజీవంగానే ఉందని సచిన్ తెలిపాడు. జట్టుకు భారమని అనిపిస్తే క్రికెట్‌కు గుడ్‌బై చెప్తానే తప్ప, అంతర్జాతీయ క్రికెట్ నుంచి ప్రస్తుతానికి తప్పుకునే ప్రసక్తే లేదని మాస్టర్ స్పష్టం చేశాడు.

ఇదిలా ఉంటే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన 21 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో 177 టెస్టుల్లో 14,692, 453 వన్డేల్లో 18,111 పరుగులు సాధించాడు. అతని ఖాతాలో 51 టెస్టు, 48 వన్డే సెంచరీలున్నాయి. అలాగే అంతర్జాతీయ క్రికెట్‌లో మాస్టర్ సచిన్ వంద శతకాలు సాదించేందుకు కేవలం ఒక్క అడుగు దూరంలో నిలిచాడు.

Share this Story:

Follow Webdunia telugu