Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాజ్యసభలో సచిన్ టెండూల్కర్ సెంట్రాఫ్ ఎట్రాక్షన్‌!

రాజ్యసభలో సచిన్ టెండూల్కర్ సెంట్రాఫ్ ఎట్రాక్షన్‌!
, మంగళవారం, 6 ఆగస్టు 2013 (11:37 IST)
FILE
భారత దిగ్గజ క్రికెటర్, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ సోమవారం పార్లమెంటులో సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా మారాడు. సోమవారం నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. నల్ల రంగు ఫ్యాంటు దానిపై నీలం నిలువు చారల చొక్కా ధరించిన టెండూల్కర్ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహా య మంత్రి రాజీవ్ శుక్లాతో కలిసి రాజ్యసభలోకి ప్రవేశించాడు.

తన పక్కనున్న రచయిత జావెద్ అక్తర్‌తో ముచ్చటించారు. సచిన్ భార్య అంజలి సందర్శకుల గ్యాలరీలో కూర్చున్నా రు. చాంపియన్స్ ట్రోఫీని నెగ్గిన భారత జట్టును చైర్మన్ హమీద్ అన్సారీ అభినందించినపుడు టెండూల్కర్ బల్లపై చరచి తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. అంతరాయాలతో సభ వాయిదా పడిన తర్వాత టెండూల్కర్ ప్రధాని మన్మోహన్ సింగ్ వద్దకు వెళ్లి కరచాలనం చేశాడు.

Share this Story:

Follow Webdunia telugu