Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యాషెస్ సిరీస్: నిలకడగా ఇంగ్లండ్ బ్యాటింగ్

యాషెస్ సిరీస్: నిలకడగా ఇంగ్లండ్ బ్యాటింగ్
ప్రతిష్టాత్మక యాషెస్ టెస్ట్ సిరీస్‌లో భాగంగా గురువారం లార్డ్స్ మైదానంలో ప్రారంభమైన రెండో టెస్టులో ఇంగ్లండ్ బ్యాటింగ్ నిలకడగా సాగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ జట్టుకు ఓపెనర్లు మంచి శుభారంభాన్ని అందించారు. దీంతో తొలి రోజు లంచ్ సమయానికి ఇంగ్లండ్ జట్టు వికెట్ నష్టపోకుండా 126 పరుగులు చేసింది.

ఓపెనర్లు ఆండ్రూ స్ట్రాస్ 47, అలిస్టర్ కుక్ 67 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. కాగా, కుక్ మాత్రం టెస్టు కెరీర్‌లో తన 20వ అర్థ సెంచరీని పూర్తి చేశాడు. ఇంగ్లండ్ ఓపెనర్లు ఆసీస్ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ప్రపంచ మూడో ర్యాంకు బౌలర్ మిచెల్ జాన్సన్‌ బౌలింగ్‌ను ఇంగ్లీష్ ఓపెనర్లు ఉతికి ఆరేశారు. జాన్సన్ వేసిన ఎనిమిది ఓవర్లలో 53 పరుగులు సమర్పించుకున్నాడు.

జట్ల వివరాలు.. ఇంగ్లండ్:- స్ట్రాస్ (కెప్టెన్), కుక్, రవి బొపరా, పీటర్సన్, కాలింగ్‌వుడ్, ప్రియర్, ఫ్లింటాఫ్, స్టువర్ట్ బ్రాడ్, స్వాన్, ఆండర్సన్, ఓనియన్స్.

ఆస్ట్రేలియా:- హౌస్, కటిచ్, పాంటింగ్, హుస్సే, క్లార్క్, నార్త్, హిడ్డన్, మిచెల్ జాన్సన్, హౌరిట్జ్, హిల్ఫ్‌న్హౌస్, పీటర్ సైడిల్.

Share this Story:

Follow Webdunia telugu