Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరిన్ని పోటీల నిర్వహణకు భారత్ సిద్ధం

Webdunia
గురువారం, 5 మార్చి 2009 (10:02 IST)
వచ్చే 2011లో భారత ఉపఖండంలో జరుగున్న ప్రపంచ కప్ క్రికెట్ పోటీలకు పాకిస్థాన్‌ను దూరం చేస్తే స్వదేశంలో మరిన్ని పోటీలను నిర్వహించేందుకు భారత్ సిద్ధంగా ఉన్నట్టు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు వర్గాలు వెల్లడించాయి. 2011 ప్రపంచ కప్ క్రికెట్ పోటీలను భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న విషయం తెల్సిందే.

అయితే లాహోర్‌లో శ్రీలంక క్రికెటర్లపై ఉగ్రవాదుల దాడులు జరిపిన నేపథ్యంలో పాక్‌లో జరగాల్సిన ప్రపంచ కప్ పోటీల నిర్వహణ అనుమానాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో మరికొన్ని అదనపు మ్యాచ్‌ల నిర్వహణకు భారత్ సిద్ధంగా ఉన్నట్టు భారత క్రికెట్ వర్గాలు బుధవారం వెల్లడించాయి. అయితే ఈ సమస్య అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) కోర్టులో ఉందని, దీనిపై అన్ని దేశాల సభ్యులతో చర్చలు జరపాల్సి వుందని బీసీసీఐ అధ్యక్షుడు శశాంక్ మనోహన్ నాగ్‌పూర్‌లో వ్యాఖ్యానించారు.

అదనపు మ్యాచ్‌ల నిర్వహణకు భారత్ సర్వదా సిద్ధం. ఇందులో ఎలాంటి సమస్యా లేదు. భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లతో కలిసి క్రికెట్ మ్యాచ్‌ల నిర్వహించేందుకు పాక్ కూడా సన్నద్ధం కావాలని ఆశిస్తున్నా. అయితే, పరిస్థితుల్లో మార్పులు రాకుంటే దానికి చేసేదేమి ఉండబోదన్నారు. ఇదిలావుండగా, గత యేడాది పాక్ గడ్డపై జరగాల్సిన ఛాంపియన్ ట్రోఫీని కూడా ఐసిసి వాయిదా వేసిన విషయం తెల్సిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

వియత్నాం తీరంలో విషాదం - పడవ బోల్తాపడి 34 మంది దుర్మరణం

మరిదితో అక్రమ సంబంధం.. నిద్ర మాత్రలతో భర్త చనిపోలేదని కరెంట్ షాకిచ్చి చంపేసిన భార్య

మహిళా ఉద్యోగిని అలా వేధించిన డీసీపీఓ ఆఫీసర్.. ఇంటికెళ్తే ఆఫీసుకు రమ్మంటాడు...

Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కామ్‌: వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ (video)

Sonu Sood: పామును చేతిలో పట్టుకున్న సోనూసూద్.. ఎందుకో తెలుసా? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

Show comments