Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారత్ చేతిలో శ్రీలంక చిత్తు : ట్రై సిరీస్ ఫైనల్‌ల్లో కోహ్లీ సేన

భారత్ చేతిలో శ్రీలంక చిత్తు : ట్రై సిరీస్ ఫైనల్‌ల్లో కోహ్లీ సేన
, బుధవారం, 10 జులై 2013 (09:24 IST)
File
FILE
వెస్టిండీస్ గడ్డపై జరుగుతున్న ట్రై సిరీస్‌లో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ప్రత్యర్థి శ్రీలంక జట్టుపై భారత్ ఘన విజయం సాధించింది. ఫలితంగా విరాట్ కోహ్లీ సేన ఫైనల్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో వరుణుడు అంతరాయం కలిగించినప్పటికీ... శ్రీలంక జట్టుపై భారత్ 81 పరుగుల భారీ తేడాతో ఘనం విజయం సాధించడంతో బోనస్ పాయింట్‌తో ఫైనల్‌కు చేరింది.

ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన శ్రీలంక జట్టు ఫీల్డింగ్‌ను ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు వరుణుడు అడ్డంకిగా నిలిచాడు. బ్యాటింగ్‌కు కష్టమైన పిచ్‌పై పరుగులు రాబట్టుకోవడానికి భారత ఓపెనర్లతో పాటు ఇతర బ్యాట్స్‌మెన్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లు తడబడుతూ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు.

అలా సాఫీగా సాగిపోతున్న దశలో 6.2 ఓవర్ వద్ద ధావన్ (15) వికెట్ కోల్పోయింది. అనంతరం వచ్చిన కెప్టెన్ కోహ్లీ నెమ్మదిగా ఆడుతూ రోహిత్ శర్మకు పూర్తి సహకారం అందిస్తూ ఇన్నింగ్స్ చక్కదిద్దే పనిని చేపట్టాడు. అయితే, 15 ఓవర్ వద్ద కోహ్లీ (31) ఔట్ కావడం, ఆ తర్వాత దినేష్ కార్తిక్ 12 పరుగులు చేసి హెరాయిత్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆసమయంలో వర్షం పడటంతో భారత్ ఇన్సింగ్‌ను నిలిపివేశారు. అప్పటికి భారత్ స్కోరు 29 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది.

వర్షం చాలా సేపటికి నిలిచి పోవడంతో మ్యాచ్‌ ఓవర్లను కుదించి, డక్‌వర్త్ లూయిస్ పద్ధతి మేరకు శ్రీలంక విజయాన్ని 26 ఓవర్లలో 178 పరుగులుగా నిర్ణయించారు. దీంతో బ్యాటింగ్‌కు దిగిన లంకేయులు.. భారత పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ధాటికి విలవిలలాడింది. భువన్ విజృంభించి ఏకంగా నాలుగు వికెట్లు తీయడంతో పాటు ఇతర బౌలర్లు ఇషాంత్ శర్మ, జడేజా రెండేసి వికెట్లు తీయగా అశ్విన్ ఒక వికెట్ పడగొట్టాడు.

ఫలితంగా శ్రీలంక జట్టు కేవలం 24.4 ఓవర్లలో 96 పరుగులకే ఆలౌట్ అయింది. లంక జట్టులో చండిమాల్ మాత్రమే అత్యధికంగా 26 పరుగులు చేశాడు. మిగతా బ్యాట్‌మెన్లు క్రీజ్‌లో నిలదొక్కుకోలే చేతులెత్తేశారు. భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన భువనేశ్వర్ కుమార్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ విజయంతో భారత్ ఫైనల్‌కు చేరగా... ఫైనల్‌లో కూడా శ్రీలంకతోనే భారత్ తలపడనుంది.

Share this Story:

Follow Webdunia telugu