Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ ఎప్పటికీ ప్రమాదకారే : విటోరీ

Webdunia
జార్ఖండ్ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని టీం ఇండియా ఎప్పటికీ ప్రమాదకారిగానే ఉంటుందని.. న్యూజిలాండ్ కెప్టెన్ డేనియల్ విటోరీ వ్యాఖ్యానించాడు. రెండు ట్వంటీ20 మ్యాచ్‌లలో గెలుపొందినప్పటికీ.. తాము ప్రత్యర్థి జట్టును అంత తక్కువగా అంచనా వేయటం లేదని అన్నాడు.

ట్వంటీ20 సిరీస్‌ విజయంతో జట్టుకు మంచి ఊపును, ఉత్సాహాన్ని ఇచ్చినప్పటికీ... టీం ఇండియాపట్ల తగు జాగరూకతతోనే మెలగుతున్నామని విటోరీ పేర్కొన్నాడు. అయితే, మంగళవారం ప్రారంభం కానున్న వన్డే సిరీస్ సిరీస్‌లో టీం ఇండియా పుంజుకుంటుందని ఆందోళన వ్యక్తం చేశాడు.

వెనువెంటనే పుంజుకునే సామర్థ్యం టీం ఇండియా సొంతమనీ... వాళ్లు స్వేచ్ఛగా క్రికెట్ ఆడతారనీ విటోరీ ఆందోళనతో కూడిన సంతోషం వ్యక్తం చేశాడు. భారత ఆటగాళ్లు ఒక్కసారి గాడిలో పడినట్లయితే, ఇక వాళ్లను ఆపటం చాలా కష్టసాధ్యమైన విషయమని విటోరీ చెప్పాడు. ప్రస్తుతానికి తమకు ట్వంటీ20 విజయాలే ఆత్మవిశ్వాసాన్నిస్తున్నాయన్నాడు.

తాము ఇంకా మెరుగైన ఆటతీరును ప్రదర్శిస్తూ, ముందుకెళ్ళాల్సి ఉంటుందనీ... టీం ఇండియాను అన్నివేళలా కొంత ఒత్తిడిలో ఉంచాలని వెటోరీ తెలిపాడు. ఎందుకంటే... ఆ జట్టులో చాలామంది ప్రతిభావంతమైన ఆటగాళ్ళున్నారనీ.. బ్యాటింగ్ శక్తితో వారు వెంటనే పుంజుకునే అవకాశం ఉందని అన్నాడు. ఇక ట్వంటీ20లో లేని మాస్టర్ బ్లాస్టర్ జట్టులో చేరడంతో టీం ఇండియా వన్డేలలో ఖచ్చితంగా లబ్ది పొందుతారని విటోరీ చెప్పాడు.

సచిన్ రావడమే కాదు... తనతోపాటు అపారమైన అనుభవాన్ని తీసుకొస్తాడని విటోరీ తెలియజేశాడు. కివీస్‌లో గతంలో పర్యటించిన ఆయనకు ఇక్కడి పరిస్థితులపై తప్పకుండా అవగాహన ఉంటుందనీ.. ఆ అనుభవంతోనే జట్టును నడిపిస్తాడనీ అన్నాడు. అంతకంటే మించి ప్రపంచ క్రికెట్‌లోనే గొప్ప బ్యాట్స్‌మెన్ అయిన సచిన్ రాకతో టీం ఇండియాలో ఖచ్చితంగా మార్పు గోచరిస్తుందని విటోరి పేర్కొన్నాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

హనీమూన్ ఖర్చు కోసం పెళ్ళి విందులో మొదటి ప్లేట్ భోజనాన్ని వేలం వేసిన కొత్త జంట... (వీడియో)

మెగా డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించిన డ్రాగన్ కంట్రీ.. భారత్ ఆందోళన

అసెంబ్లీలో వ్యవసాయంపై చర్చ : ఆన్‌లైన్‌ రమ్మీ గేమ్‌లో నిమగ్నమైన వ్యవసాయ మంత్రి

పిన్నెల్లి బూత్ క్యాప్చర్‌ను ఎదిరించిన టీడీపీ కార్యకర్త ఇకలేరు...

ప్రియురాలు కానిస్టేబుల్‌ను హత్య చేసి ఠాణాలో లొగిపోయిన ఏఎస్ఐ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

Show comments