Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఫిక్సింగ్‌కు అత్యాశే ప్రధాన కారణం: షారూఖ్ ఖాన్

ఫిక్సింగ్‌కు అత్యాశే ప్రధాన కారణం: షారూఖ్ ఖాన్
FILE
క్రికెట్‌లో స్పాట్ ఫిక్సింగ్, మ్యాచ్ ఫిక్సింగ్‌లకు కొంతమంది క్రీడాకారుల్లో ఉన్న అత్యాశే ప్రధాన కారణమని బాలీవుడ్ నటుడు, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో కోల్‌కతా నైట్ రైడర్స్ భాగస్వామి షారుఖ్ ఖాన్ అన్నాడు. ఫిక్సింగ్ అన్నది కొత్తకాదని, ప్రపంచ వ్యాప్తంగా అది విస్తరించిందని షారూఖ్ వ్యాఖ్యానించాడు.

ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ (ఇపిఎల్) ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్స్‌లోనూ ఫిక్సింగ్ జాడలు ఉన్నాయని చెప్పాడు. బ్రిటన్‌లో పందాలు కాయడం చట్టబద్ధమని, అయినప్పటికీ అక్కడ ఫిక్సింగ్ జరుగుతోందని అన్నాడు. సులభ మార్గాల్లో డబ్బు సంపాదించాలని ప్రజల్లో ఉన్న అత్యాశే ఫిక్సింగ్‌కు కారణమవుతున్నదని ఈ సమస్యకు కొత్త భాష్యం చెప్పాడు.

Share this Story:

Follow Webdunia telugu