Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రస్తుత పరిస్థితుల్లో పోటీలు నిర్వహించలేం: మోర్గాన్

Webdunia
బుధవారం, 4 మార్చి 2009 (08:39 IST)
పాకిస్థాన్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అక్కడ ప్రపంచ కప్ పోటీలను నిర్వహించలేమని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) అధ్యక్షుడు డేవిడ్ మోర్గాన్ అభిప్రాయపడ్డారు. భద్రతా ఏర్పాట్లను గణనీయంగా మెరుగుపరచుకోకుంటే పాకిస్థాన్‌లో అంతర్జాతీయ క్రికెట్ పోటీలు జరిగే అవకాశాలు లేవని ఆయన స్పష్టం చేశారు.

ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా పాకిస్థాన్ అత్యంత ప్రమాదకరమైన దేశమనే విషయం తేటతెల్లమవుతోందన్నారు. మంగళవారం లాహోర్‌లో శ్రీలంక క్రికెటర్లపై ఉగ్రవాదుల దాడులు జరిపిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అంతర్జాతీయ పోటీ ఒక్కటైనా అక్కడ జరగాలంటే పరిస్థితులు పూర్తిగా చక్కబడాలి. నా అభిప్రాయంలో అధికార యంత్రాంగం మారాలి అని అన్నారు.

పాకిస్థాన్‌లో ప్రస్తుత పరిస్థితిని ఐసిసి చీఫ్ ఎగ్జిక్యూటివ్‌తో చర్చించినట్టు చెప్పారు. అలాగే, ఐసిసి ఉపాధ్యక్షుడు శరద్ పవార్‌తో కూడా చర్చించామన్నారు. తమ సంభాషణల్లో వచ్చే వారం భేటీ అయ్యేందుకు నిర్ణయించినట్టు చెప్పారు. ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో అక్కడ మ్యాచ్‌లు నిర్వహించడం సాధ్యం కాదని ఆయన అన్నారు.

అయితే పాకిస్థాన్‌లో అంతర్జాతీయ క్రికెట్ పోటీల యుగం ముగిసిందని తాను చెప్పలేనన్నారు. 2011 ప్రపంచ కప్ ఆర్గనైజింగ్ కమిటీ ఛైర్మన్, కేంద్ర మంత్రి శరద్ పవార్ వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

డ్రగ్స్ ప్రిస్కిప్షన్ కోసం శృంగారాన్ని డిమాండ్ చేసిన భారత సంతతి వైద్యుడు..

హనీమూన్ ఖర్చు కోసం పెళ్ళి విందులో మొదటి ప్లేట్ భోజనాన్ని వేలం వేసిన కొత్త జంట... (వీడియో)

మెగా డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించిన డ్రాగన్ కంట్రీ.. భారత్ ఆందోళన

అసెంబ్లీలో వ్యవసాయంపై చర్చ : ఆన్‌లైన్‌ రమ్మీ గేమ్‌లో నిమగ్నమైన వ్యవసాయ మంత్రి

పిన్నెల్లి బూత్ క్యాప్చర్‌ను ఎదిరించిన టీడీపీ కార్యకర్త ఇకలేరు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Show comments