Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పెర్త్ టెస్టులో వెస్టిండీస్ విజయం ఖాయం: క్రిస్ గేల్

పెర్త్ టెస్టులో వెస్టిండీస్ విజయం ఖాయం: క్రిస్ గేల్
ఆస్ట్రేలియాతో పెర్త్‌లో జరుగనున్న టెస్టులో వెస్టిండీస్ విజయం ఖాయమని ఆ జట్టు కెప్టెన్ క్రిస్ గేల్ ధీమా వ్యక్తం చేశాడు. ప్రస్తుతం తమ జట్టు గట్టి ఫామ్‌లో ఉందని తప్పకుండా పెర్త్ టెస్ట్‌ను కైవసం చేసుకుంటుందని గేల్ నమ్మకం వ్యక్తం చేశాడు.

అడిలైడ్‌లో జరిగిన టెస్టులో ధీటుగా రాణించి కంగారూలను ఒత్తిడిలోకి నెట్టామని గేల్ అన్నాడు. అందుచేత తదుపరి టెస్టులోనూ అదే తరహాలో నైపుణ్యంతో ఆడి గెలుస్తామని క్రిస్ గేల్ వెల్లడించాడు.

అడిలైడ్‌లో టెస్టులో ఐదు రోజులు తమ జట్టు ఆస్ట్రేలియాపై బాగానే ఆడిందని.. కానీ టెస్టు డ్రా ముగియడం ఎంతో నిరాశకు గురిచేసిందని క్రిస్ గేల్ అన్నాడు.

ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియాతో జరిగిన అడిలైడ్‌ టెస్టులో వెస్టిండీస్ కెప్టెన్ క్రిస్ గేల్ ఒంటి చేత్తో జట్టును నడిపించాడు. ఏకంగా 169 పరుగులు సాధించి, ఆసీస్ బౌలర్లను ఆటాడుకున్నాడు. దీంతో టెస్టు క్రికెట్లో ఆస్ట్రేలియాపై తొలి సెంచరీని సాధించిన క్రికెటర్‌గా క్రిస్ గేల్ చరిత్ర సృష్టించాడు.

Share this Story:

Follow Webdunia telugu