Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

న్యూజిలాండ్ క్రికెట్ జట్టులో బాండ్, టఫీ

న్యూజిలాండ్ క్రికెట్ జట్టులో బాండ్, టఫీ
ఫాస్ట్ బౌలర్లు షేన్ బాండ్, డారెల్ టఫీలు న్యూజిలాండ్ క్రికెట్ జట్టులో తిరిగి చోటు దక్కించుకున్నారు. ఇండియన్ క్రికెట్ లీగ్ (ఐసీఎల్)తో ఒప్పందాలు కుదుర్చుకొని, ప్రస్తుతం దానితో తెగతెంపులు చేసుకున్న వీరిద్దరికీ న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు క్షమాభిక్ష ప్రసాదించింది. దీంతో వీరిద్దరూ తిరిగి అంతర్జాతీయ జట్టులోకి వచ్చేందుకు మార్గం సుగమమైంది.

ఐసీఎల్‌లోకి వెళ్లిన ఆటగాళ్లకు క్షమాభిక్ష ప్రసాదించేందుకు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఒక్క షరతు మాత్రమే విధించింది. ఐసీఎల్‌తో పూర్తిగా సంబంధాలు తెంచుకున్న ఆటగాళ్లకు దేశం తరపున ఆడే అవకాశం ఇస్తామని బోర్డు ఆటగాళ్లకు తెలియజేసింది. ఇదిలా ఉంటే తాజాగా న్యూజిలాండ్ బోర్డు గ్రీన్‌సిగ్నల్ పొందిన షేన్ బాండ్ ఆగస్టు ప్రారంభంలో భారత్‌లో పర్యటించే న్యూజిలాండ్- ఏ జట్టు తరపున ఆడతాడు.

అనంతరం శ్రీలంకలో వన్డే సిరీస్, ట్వంటీ- 20 మ్యాచ్‌లు ఆడనున్నాడు. ఇదిలా ఉంటే మరో మాజీ ఐసీఎల్ ఆటగాడు డారెల్ టఫీ దేశవాళీ క్రికెట్‌లో తన పునరాగమనాన్ని బలంగా చాటుకున్నాడు. దీంతో అతనికి శ్రీలంక వెళ్లే న్యూజిలాండ్ టెస్ట్ జట్టులో స్థానం లభించింది.

న్యూజిలాండ్ జట్ల
శ్రీలంక పర్యటనకు వెళ్లే న్యూజిలాండ్ టెస్ట్ జట్టు: డేనియల్ విటోరీ (కెప్టెన్), క్రైగ్ కుమ్మింగ్, గ్రాంట్ ఇలియట్, డేనియల్ ఫ్లైన్, మార్టిన్ గుప్తిల్, క్రిస్ మార్టిన్, బ్రెండన్ మెక్‌కలమ్, టిమ్ మెక్‌ఇంతోష్, ఇయాన్ ఓ బ్రైన్, జాకబ్ ఓరమ్, జీతన్ పటేల్, జెస్సీ రైడర్, రాస్ టేలర్, డారెల్ టఫీ, రీస్ యంగ్

శ్రీలంకలో వన్డే సిరీస్, ట్వంటీ- 20 జట్టు: డేనియల్ విటోరీ (కెప్టెన్), షేన్ బాండ్, నీల్ బ్రూమ్, ఇయాన్ బట్లెర్, గ్రాంట్ ఇలియట్, మార్టిన్ గుప్తిల్, గారెత్ హోప్కిన్స్, బ్రెండన్ మెక్‌కలమ్, నాథన్ మెక్‌కలమ్, పీటర్ మెక్‌గ్లాషన్, కైల్ మిల్స్, జాకబ్ ఓరమ్, జీతన్ పటేల్, జెస్సీ రైడర్, రాస్ టేలర్

భారత్‌లో పర్యటించే న్యూజిలాండ్ ఏ జట్టు: పీటర్ పుల్టన్ (కెప్టెన్), బ్రెంట్ ఆర్నెల్, షేన్ బాండ్, నీల్ బ్రూమ్, బ్రెండన్ డైమంతి, గారెత్ హోప్కిన్స్, జేమీ హౌ, పీటర్ మెక్‌గ్లాషన్, నాథన్ మెక్‌కలమ్, కైల్ మిల్స్, తరుమ్ నెథులా, అరోన్ రెడ్‌మండ్, టిమ్ సౌథీ, బేజే వాల్టింగ్, కనే విలియమ్సన్.

Share this Story:

Follow Webdunia telugu