Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నాకిష్టమైన గ్రౌండ్స్‌లో ఎస్‌సీజీ ఒకటి: సచిన్ టెండూల్కర్

నాకిష్టమైన గ్రౌండ్స్‌లో ఎస్‌సీజీ ఒకటి: సచిన్ టెండూల్కర్
, శనివారం, 31 డిశెంబరు 2011 (15:47 IST)
ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరిగే రెండో టెస్ట్ మ్యాచ్‌లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన వందో సెంచరీకి ఎస్.సి.జి వేదిక అయ్యే అవకాశం ఉందని చెప్పవచ్చు. జనవరి 3వ తేది నుండి ప్రారంభమైయ్యే రెండో టెస్ట్ మ్యాచ్‌‌ జరిగే ఎస్.సి.జి (సిడ్నీ క్రికెట్ గ్రౌండ్) కూడా ఈ మాస్టర్ బ్యాట్స్‌మన్‌కు ఇష్టమైన గ్రౌండ్స్‌లో ఒకటి.

ఈ గ్రౌండ్‌లో సచిన్ ఆడిన నాలుగు టెస్ట్ మ్యాచ్‌‌లో 221 సగటుతో రెండు సెంచరీలు, ఒక డబుల్ సెంచరీ చేశాడు. ఇక్కడ సచిన్ వ్యక్తిగత పరుగులు 241 నాటౌట్. ఎస్.సి.జి (సిడ్నీ క్రికెట్ గ్రౌండ్) కచ్చితంగా నాకు ఇష్టమైన గ్రౌండ్స్‌లో ఒకటి అని క్రికెట్ దిగ్గజం సచిన్ ఇప్పటికే వెల్లడించాడు. ఇక్కడ ఆడటం నాకు ఎంతో ఇష్టంగా ఉంటుందని వాతావరణం కూడ చాలా బాగుండిదని ది డైలీ టెలిగ్రాఫ్‌కు సచిన్ చెప్పాడు.

22 సంవత్సరాల సచిన్ క్రీడా జీవితంలో ఇప్పటి వరకూ 59 గ్రౌండ్స్‌లో క్రికెట్‌ మ్యాచ్‌‌లు ఆడగా బంగ్లాదేశ్‌లోని ఢాకా మరియు మీర్‌పూర్‌‌లో మాత్రమే ఎక్కువ మ్యాచ్‌లు ఆడినట్లు రికార్డు కలిగివున్నాడు.

కాగా మెల్‌బోర్న్‌లో మొదటి టెస్ట్ గెలిచిన ఆస్ట్రేలియా.. సిడ్నీలో జరిగే రెండో టెస్ట్ కూడ గెలిచి భారత్‌పై ఒత్తిడి పెంచాలని భావిస్తుంది. సిడ్నీలో సచిన్ ఆడే చివరి మ్యాచ్‌‌ ఇదే కావచ్చునని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎస్.సి.జి ట్రస్ట్ మరియు క్రికెట్ ‌న్యూ సౌత్‌వెల్స్ కూడా సచిన్ చేసే సెంచరీ మీదే టికెట్ల అమ్మకాలు ఆధారపడి ఉన్నాయని భావిస్తుంది.

రెండో టెస్ట్ జరిగే ఈ గ్రౌండ్‌లో ఇప్పటి వరకూ మొదటి రోజు 14,600 టికెట్స్, రెండవ రోజు 8,500, మూడవ రోజు 7,000 మరియు నాల్గవ రోజు మ్యాచ్‌ చూడటానికి వచ్చే ప్రేక్షకుల సంఖ్య 1,600గా ఉందని ఎన్ఎస్‌డభ్ల్యూ ఛీఫ్ ఎక్స్‌క్యూటివ్‌ డేవ్ గిల్‌బర్ట్ వివరించాడు.

Share this Story:

Follow Webdunia telugu