Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వరలో కొత్త షెడ్యూల్ ‌: మోడీ

Webdunia
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ట్వంటీ20 టోర్నీ మ్యాచ్‌లకు సంబంధించిన కొత్త షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటించనున్నట్లు... ఐపీఎల్ ఛైర్మన్ లలిత్ మోడీ శుక్రవారం వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఐపీఎల్ వేదికకు 14 నగరాలను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు.

కాగా, భద్రతా ఏర్పాట్లపైన వచ్చే వారంలో సమీక్ష జరుపుతామని మోడీ వివరించారు. ఎన్నికల కౌంటింగ్ రోజున మ్యాచ్‌లు ఉండబోవని ఈ సందర్భంగా ఆయన తేల్చి చెప్పారు. ఓ వైపు సార్వత్రిక ఎన్నికలు, మరోవైపు పాక్‌లో శ్రీలంక క్రికెటర్లపై దాడితో... భద్రత కల్పించలేమంటూ వివిధ రాష్ట్రాల డీజీపీలు చేతులెత్తేయడం తెలిసిన సంగతే.

ఈ నేపథ్యంలో... కేంద్ర హోంశాఖా మంత్రి పి. చిదంబరం కూడా ఎన్నికలు జరుగుతాయి కాబట్టి, ఆ సమయంలో భద్రత కల్పించలేము కాబట్టి, ఐపీఎల్‌ను వాయిదా వేసుకోమని సూచించిన సంగతి విదితమే. దీంతో... మొదట షెడ్యూలును మార్చేది లేదన్న ఐపీఎల్‌ ఛైర్మన్‌ లలిత్‌ మోడీ కాస్తంత వెనక్కి తగ్గి త్వరలో కొత్త షెడ్యూలు ప్రకటిస్తామని తెలిపారు.

ఈ మేరకు గురువారం ఇదివరకే తాము ప్రకటించిన షెడ్యూల్‌లో మార్పులు చేసిన ఐపీఎల్, తుది నిర్ణయం కోసం హోంశాఖ వద్దకు సవరించిన షెడ్యూల్‌ను పంపించిన సంగతి తెలిసిందే. తాజా షెడ్యూల్‌లో.. పోలింగ్ జరిగే తేదీ రెండు రోజుల ముందు, పోలింగ్ తరువాతి రెండు రోజులలో మ్యాచ్‌లు నిర్వహించబోమని సూచించారు. ఎన్నికల తేదీలు, ఐపీఎల్‌ మ్యాచ్‌ల తేదీలు రెండూ ఒకేసారి రావడంతో... ఆటగాళ్లకు భద్రత కల్పించడం కష్టతరంగా మారనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మోడీ ప్రకటించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మరిదితో అక్రమ సంబంధం.. నిద్ర మాత్రలతో భర్త చనిపోలేదని కరెంట్ షాకిచ్చి చంపేసిన భార్య

మహిళా ఉద్యోగిని అలా వేధించిన డీసీపీఓ ఆఫీసర్.. ఇంటికెళ్తే ఆఫీసుకు రమ్మంటాడు...

Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కామ్‌: వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ (video)

Sonu Sood: పామును చేతిలో పట్టుకున్న సోనూసూద్.. ఎందుకో తెలుసా? (video)

Heavy Rains: హైదరాబాదులో భారీ వర్షాలు.. ఏం భయం లేదంటున్న సర్కార్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

Show comments