Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టెస్ట్ క్రికెట్‌ను కాపాడండి: కాలింగ్‌వుడ్ పిలుపు

టెస్ట్ క్రికెట్‌ను కాపాడండి: కాలింగ్‌వుడ్ పిలుపు
FileFILE
ప్రస్తుత పరిస్థితుల్లో టెస్ట్ క్రికెట్‌ను కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఇంగ్లాండ్ ట్వంటీ-20 జట్టు కెప్టెన్ పాల్ కాలింగ్‌వుడ్ పిలుపునిచ్చాడు. క్రికెట్‌లో కొత్త ఫార్మాట్‌ అయిన ట్వంటీ 20 కారణంగా పాతదైన టెస్ట్ క్రికెట్ కనుమరుగయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించాడు.

లండన్‌లో విజ్డెన్ క్రికెటర్ మ్యాగ్‌జైన్‌లో కాలింగ్ వుడ్ మాట్లాడుతూ. ట్వంటీ-20 క్రికెట్ యువ ఆటగాళ్లను అధికంగా ఆకర్షిస్తోందని అభిప్రాయపడ్డాడు. దీని వల్ల టెస్ట్ క్రికెట్ వంటి పాత ఫార్మాట్‌లపై భవిష్యత్ తరాల ఆటగాళ్లలో ఆసక్తి తగ్గిపోతుందని విశ్లేషించాడు.

యాషస్ సిరీస్‌లలో ఎదురయ్యే మానసిక ఒత్తిడి కన్నా స్వల్ప కాలంలో ఫలితం తేలే ట్వంటీ-20లలో ఆడటాన్నే వారు ఎంపిక చేసుకునే అవకాశం ఉందని కాలింగ్‌వుడ్ వివరించాడు. దీనికి తోడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) గ్లామర్‌ మాటున నడిచే ట్వంటీ-20 టోర్నీలో ఉత్సాహపరిచే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నాడు. దీని ప్రభావాన టెస్ట్ క్రికెట్ భవితవ్యం ఎంటో అర్థం కావడం లేదని కాలింగ్‌వుడ్ విచారం వ్యక్తం చేశాడు.

Share this Story:

Follow Webdunia telugu