Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గెలుస్తాం.. టైటిల్ తీసుకెళతాం: యూనిస్ ధీమా

గెలుస్తాం.. టైటిల్ తీసుకెళతాం: యూనిస్ ధీమా
FileFILE
ఇంగ్లాండ్‌లో జరుగనున్న ట్వంటీ 20 ప్రపంచకప్ పోటీల్లో తాము విజయభేరి మ్రోగిస్తామని.. టైటిల్‌ను తీసుకెళతామని పాకిస్థాన్ జట్టు కెప్టెన్ యూనిస్ ఖాన్ ధీమా వ్యక్తం చేశాడు. చక్కటి ప్రదర్శనతో తామేంటో ఈ ప్రపంచకప్‌లో నిరూపిస్తామని యూనిస్ వ్యాఖ్యానించాడు.

దుబాయ్‌లో మంగళవారం ప్రప్రంచకప్ టోర్నీ ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా యూనిస్ విలేకరులతో మాట్లాడాడు. 2007లో తాము అద్భుతమైన ఆటతీరును కనబరిచామని యూనిస్ గుర్తు చేశాడు. అయితే ఫైనల్లో భారత్ చేతిలో అనూహ్య ఓటమి ఎదురైందని తెలిపాడు.

అయితే ఈ సారి మాత్రం ప్రపంచకప్ సాధించేందుకు తమ సర్వ శక్తులు ఉపయోగిస్తామన్నాడు. ఈ ప్రపంచకప్‌లో తామున్న గ్రూపులో ఆస్ట్రేలియా కూడా ఉండటం తమకొక సవాలు లాంటిదని పేర్కొన్నాడు. కాగా, ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్రాడ్ హడిన్ కూడా పాల్గొన్నాడు.

Share this Story:

Follow Webdunia telugu