Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఐసీసీ ట్వంటీ- 20 మత్తులో పడదు: లోర్గాత్

ఐసీసీ ట్వంటీ- 20 మత్తులో పడదు: లోర్గాత్
ప్రపంచవ్యాప్తంగా నానాటికీ ట్వంటీ- 20 క్రికెట్‌కు ఆదరణ భారీగా పెరుగుతున్నప్పటికీ, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఈ తరహా క్రికెట్ మత్తులో పడబోదని ఐసీసీ సీఈవో హరూన్ లోర్గాత్ చెప్పారు. ఐసీసీ ట్వంటీ- 20 క్రికెట్ మత్తులో పడబోదని, ఈ తరహా క్రికెట్‌కు క్యాలెంటర్‌లో ఎక్కువ చోటు కల్పించబోదని చెప్పారు.

ఇటీవల పాకిస్థాన్- భారత్ మధ్య జరిగిన ట్వంటీ- 20 వార్మప్ మ్యాచ్‌కు స్టేడియం నిండింది. 23 వేల మంది సామర్థ్యం ఉన్న ఒవెల్ స్టేడియం నిండటంపై లోర్గాత్ మాట్లాడుతూ.. ట్వంటీ- 20 మ్యాచ్‌లపై విధించిన పరిమితిని ఎత్తివేయాలనుకోవడం లేదన్నారు.

ఒక్కో దేశం ఏడాదికి కొన్ని ట్వంటీ- 20 మ్యాచ్‌లు మాత్రమే ఆడాలని ఐసీసీ పరిమితి విధించిన సంగతి తెలిసిందే. ట్వంటీ- 20 క్రికెట్ ఎప్పుడూ ఊరిస్తుంటుంది. అయితే దీనిపై పరిమితి ఎత్తివేయడం తెలివైన నిర్ణయం కాబోదని లోర్గాత్ అభిప్రాయపడ్డారు. దాని మత్తులో పడకుండా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu