Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆ విషయంలో అన్నయ్యే నాకు స్ఫూర్తి: ఇర్ఫాన్ పఠాన్

ఆ విషయంలో అన్నయ్యే నాకు స్ఫూర్తి: ఇర్ఫాన్ పఠాన్
టీమిండియాలో స్థానం దక్కించుకోవడం కోసం నానా తంటాలు పడుతున్న ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ తన సోదరుడు యూసుఫ్ పఠానే స్ఫూర్తి అంటున్నాడు. పవర్ హిట్టింగ్‌తో అలరించే విధ్వంసక బ్యాట్స్‌మన్ యూసుఫ్ బ్యాటింగ్‌ను తాను కూడా ఇష్టపడతానని ఇర్ఫాన్ పఠాన్ చెప్పాడు.

యూసుఫ్ లాగే నేను కూడా పవర్ హిట్టింగ్ చేయాలని అనుకుంటా. యూసుఫ్ తన బ్యాటింగ్‌తో అందరినీ అలరిస్తాడు. అతడాడే కొన్ని షాట్లు అద్భుతంగా ఉంటాయని ఇర్ఫాన్ పఠాన్ తెలిపాడు.

ప్రస్తుతం డెక్కన్ ఛార్జర్స్ తరపున ఐపీఎల్‌లో ఆడుతున్న తాను బౌలింగ్‌లో పాటు బ్యాటింగ్‌పైనా దృష్టిపెట్టాను. ఆల్‌రౌండర్‌గా తాను మరింత మెరుగవ్వాలని ఇర్ఫాన్ చెప్పాడు.

Share this Story:

Follow Webdunia telugu