దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా జట్టులో మరో ఫాస్ట్‌బౌలర్‌ను ఎంపిక చేశారు. పశ్చిమ ఆస్ట్రేలియాకు చెందిన ఈ ఫాస్ట్ బౌలర్ త్వరలో ఆసీస్ జట్టులో చేరనున్నాడు. ప్రస్తుతం జట్టులో ఉన్న బౌలర్ హిల్ఫెన్‌హౌస్ గాయంతో బాధపడుతున్నాడు. జోహెన్స్‌బర్గ్‌లో జరిగిన మొదటి టెస్టులో ఈ బౌలర్ గాయపడ్డాడు. దీంతో అతని స్థానంలో మరో బౌలర్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా ఎంపిక చేసింది.
దీనిపై ఆసీస్ క్రికెట్ జట్టు జాతీయ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ఆండ్రూ హిల్డిచ్ మాట్లాడుతూ.. వైట్ బెన్, పీటర్‌లు గాయాలతో బాధపడుతున్నారు. అందువల్ల జట్టులోకి మరో ఫాస్ట్‌బౌలర్‌ను తీసుకోవాలని జాతీయ సెలక్షన్ కమిటీ నిర్ణయించినట్టు చెప్పారు. స్టీవ్ మగోఫిన్‌ను అదనపు ఆటగాడిగా ఎంపిక చేసినట్టు చెప్పారు.
గత కొన్ని రోజులుగా స్వదేశంలో బాగా రాణిస్తూ, జాతీయ జట్టులో స్థానం కోసం పోటీ పడుతున్నాడని చెప్పారు. వీట్ బిక్స్ షెఫిల్డ్ షీల్డ్ పోటీల్లో 38 వికెట్లు పడగొట్టిన మగోఫిన్ రెండో స్థానంలో కొనసాగుతున్నట్టు వివరించారు. దక్షిణాఫ్రికా జట్టుపై ఆడే అవకాశం వస్తే తప్పకుండా రాణిస్తాడని తాము భావిస్తున్నట్టు హిల్డిచ్ విశ్వాసం వ్యక్తం చేశాడు.