Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆధారాలు లేకపోయినా మేం నేరస్తులమా..!: సల్మాన్ భట్

ఆధారాలు లేకపోయినా మేం నేరస్తులమా..!: సల్మాన్ భట్
FILE
యావత్తు క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసిన స్పాట్ ఫిక్సింగ్ వివాదంలో ప్రమేయమున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ భట్, మొహమ్మద్ అమీర్, మొహమ్మద్ ఆసిఫ్‌లు తాము నేరస్తులనేందుకు ఎలాంటి ఆధారాలున్నాయంటూ ప్రశ్నిస్తున్నారు.

ఎలాంటి ఆధారాలు లేకపోయినా తాము నేరస్తులమా? అని అంతర్జాతీయ క్రికెట్ బోర్డు (ఐసీసీ)ని నిలదీశారు. స్పాట్ ఫిక్సింగ్ వివాదంలో ఐసీసీ తమ విషయంలో ఏకపక్షంగా వ్యవహరిస్తోందని సస్పెండైన సల్మాన్ భట్ వాపోయాడు.

అలాగే ఈ వివాదంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (ఐసీసీ) చేపట్టిన చర్యలపై కూడా సల్మాన్ భట్ విమర్శించాడు. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలకు సంబంధించి ఐసీసీ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని కెప్టెన్ అన్నాడు. తమపై వచ్చిన ఫిక్సింగ్ ఆరోపణలు పాక్ క్రికెట్ ప్రతిష్టను దెబ్బతీయడానికి పన్నిన కుట్ర అని సల్మాన్ భట్ ఆరోపించాడు.

తాము చేసుకున్న అప్పీళ్లపై ఐసీసీ విచారణ జరిగిన తీరు తీవ్ర నిరాశకు గురిచేసిందన్నాడు. ఈ వివాదంపై పీసీబీ, ఐసీసీలపై నమ్మకంతో నోరు మెదపలేదు. ఇకపై మమ్మల్ని మేమే రక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంతకుముందు ఐసీసీతో మాకు ప్రత్యక్ష సంప్రదింపులు లేవు. పీసీబీ మా తరపున ఐసీసీతో వాదించింది. ఇంకా పీసీబీకి మేము కట్టుబడి తీరాలి. అయితే ఈ వ్యవహారంపై ఐసీసీ చేపట్టిన విధానం తమను నిరాశ పరిచిందన్నాడు.

అలాగే పీసీబీ కూడా మా వ్యవహారంపై నిర్లక్ష్య వైఖరిని పాటిస్తోందని మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ చెప్పాడు. అందుచేత ఇకపై మేమే రంగంలోకి దిగి.. మా సమస్యను మేమే పరిష్కరించుకుంటామని చెప్పాడు. ఇంకా చెప్పాలంటే.. మేము స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఐసీసీ ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలను చూపించలేదు. కానీ మా అప్పీలును మాత్రం అకారణంగా తిరస్కరించింద్నాడు.

దీంతోపాటు ఐసీసీ ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. తగిన ఆధారాలు ఉంటేనే ఓ నేరస్తుడిని నిర్ధారణ చేయగలుగుతాం. అంతవరకు ఆతడు నిందితుడు కాదు. కానీ మమ్మల్ని మాత్రం ఆధారాలు లేకపోయినా నేరస్తులుగానే పరిగణించడం ఎంతవరకు సబబని సల్మాన్ భట్ ప్రశ్నించాడు. మేము స్పాట్ ఫిక్సింగ్‌లో పాల్పడినట్లు ఎవరి దగ్గరైనా ఆధారాలుంటే సమర్పించాలని కోరాడు.

మజీద్ మాకు మాత్రమే కాదు.. జట్టులోని సభ్యులందరికీ తెలుసు. ఆయన ఓ ఏజెంట్. ఆయనతో మేము స్నేహపూర్వకంగా మెలిగాం. అయితే ఎందుకో మాపై ఇలాంటి నేరాలు మోపాడన్న విషయం తెలియట్లేదు. ఎంతోమంది అభిమానులు మాతో నిలబడి ఫోటోలకు దిగుతారు. ఆటోగ్రాఫ్ తీసుకుంటారు. వారందరూ మాకు తెలుసునని చెప్పడం ఎంతవరకు సబబు అని సల్మాన్ ప్రశ్నించాడు.

Share this Story:

Follow Webdunia telugu