Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లండన్ నగరవీధుల్లో ప్రేయసితో చెట్టాపట్టాలేసుకుని తిరిగేస్తున్న యువరాజ్!

భారత క్రికెట్‌ ఆటగాళ్లు సమయం దొరికితే చాలు... కుటుంబసభ్యులతో విదేశాలకు చెక్కేస్తుంటారన్న సంగతి తెలిసిందే. క్రికెట్ దిగ్గజం సచిన్‌ ప్రస్తుతం కుటుంబసభ్యులతో కలిసి విదేశాల్లో గడుపుతున్నాడు. అంతేకాదు ఎప్ప

లండన్ నగరవీధుల్లో ప్రేయసితో చెట్టాపట్టాలేసుకుని తిరిగేస్తున్న యువరాజ్!
, బుధవారం, 29 జూన్ 2016 (14:51 IST)
భారత క్రికెట్‌ ఆటగాళ్లు సమయం దొరికితే చాలు... కుటుంబసభ్యులతో విదేశాలకు చెక్కేస్తుంటారన్న సంగతి తెలిసిందే. క్రికెట్ దిగ్గజం సచిన్‌ ప్రస్తుతం కుటుంబసభ్యులతో కలిసి విదేశాల్లో గడుపుతున్నాడు. అంతేకాదు ఎప్పటికప్పుడు తాను ఎక్కడున్నడన్నా విషయాన్ని అభిమానులతో సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుంటున్నాడు. ఇప్పుడు టీమిండియా స్టార్ బ్య‌ాట్స్‌మ‌న్ యువ‌రాజ్ సింగ్ కూడా లండ‌న్ నగరవీధుల్లో తన ప్రేయసితో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ఆనందంగా గ‌డుపుతున్నాడు. 
 
ఐపీఎల్‌-9లో స‌న్ రైజ‌ర్స్ టైటిల్ గెల‌వ‌డంలో కీల‌క పాత్ర పోషించిన యువ‌రాజ్ జింబాబ్వే పర్యటనకు ఎంపిక కాకపోవడంతో చాలాకాలం విరామం దొరకడంతో లండన్‌ చెక్కేశాడు. అక్కడ ప్రేయసి హేజెల్‌ కీచ్‌తో కలిసి సేద తీరుతున్నాడు. తాజాగా యువీ తన ప్రేయసితో కలిసి లండన్‌లోని హైడ్‌ పార్క్‌లో దిగిన ఫొటోను తన ఫేస్‌‌బుక్‌ ఖాతాలో పోస్ట్ చేశాడు. గత సంవత్సరం వీరిద్దరికీ ఎంగేజ్‌మెంట్‌ అయిన విషయం తెలిసిందే. కీచ్ ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో న‌టిస్తూ బిజీ బిజీగా ఉంది. ఈమె ''బిల్లా'', ''బాడీగార్డ్'' లాంటి ప‌లు చిత్రాల్లో ఆమె న‌టించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

2012 ఐపీఎల్ తర్వాతే ఇదంతా జరిగింది.. లేకుంటే ఫీల్డింగ్ కష్టమే: కోహ్లీ