Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గోవాలో కోహ్లీ, అనుష్క జంట: లగేజీ బ్యాగ్‌తో ముఖం దాచేసిన కోహ్లీ..!

గోవాలో కోహ్లీ, అనుష్క జంట: లగేజీ బ్యాగ్‌తో ముఖం దాచేసిన కోహ్లీ..!
, మంగళవారం, 24 నవంబరు 2015 (14:14 IST)
దక్షిణాఫ్రికాతో ఫ్రీడమ్ సిరీస్‌లో భాగంగా దొరికిన విరామాన్ని టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ బాగానే ఉపయోగించుకున్నాడు. తన గర్ల్ ఫ్రెండ్ అనుష్కతో కలిసి గోవాలో వాలిపోయాడు. గోవా టూర్‌కి తర్వాత ఈ జంట సోమవారం ముంబై చేరుకుంది. ఈ సందర్భంగా ఎయిర్ పోర్టు నుంచి బయటకు వచ్చే సమయంలో ఈ జంట మీడియా కంటికి చిక్కింది. 
 
అయితే మీడియాను చూసిన కోహ్లీ.. దొరకిపోయాను బాబోయ్ అన్నట్లుగా తన చేతిలోని లగేజీ బ్యాగ్‌తో ముఖాన్ని దాచేసుకున్నాడు. లగేజీ బ్యాగుతో ముఖాన్ని దాచుకున్న కోహ్లీ, పక్కనే అనుష్క శర్మ నవ్వుతూ నడిచి వస్తున్న సదరు ఫొటోలను అన్ని ప్రముఖ ప్రతికలు పతాక శీర్షికల్లో ప్రచురించాయి. ఫోటోలు తీయొద్దు బాబోయ్ అంటూ నవ్వుతూనే లగేజీ బ్యాగును తన ముఖానికి అడ్డంగా పెట్టేసిన ఈ ఫోటోలకు మంచి క్లిక్స్ వస్తున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu