Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీలంక చేతిలో ఓటమి భారతకు మేలు కొలుపు : వసీం అక్రమ్‌

శ్రీలంక చేతిలో ఓటమి భారతకు మేలు కొలుపు : వసీం అక్రమ్‌
, గురువారం, 11 ఫిబ్రవరి 2016 (11:59 IST)
సొంత గడ్డపై పర్యాటక శ్రీలంక క్రికెట్ జట్టు చేతిలో భారత జట్టుకు ఎదురైన ఓటమి ఆ జట్టుకు మేలు కొలుపు వంటిందని పాకిస్థాన్ క్రికెట్ లెజండ్ వసీం అక్రమ్ అన్నారు. పూణె వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత ఓడిపోయిన విషయం తెల్సిందే. దీనిపై ఆయన స్పందిస్తూ... భారత్ - శ్రీలంక జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్‌ ఫలితం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. 
 
లంక చేతిలో టీమిండియా ఓడడంతో నేను షాకయ్యాను. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో అదరగొట్టిన ధోనీసేన స్వదేశంలో లంక చేతిలో భంగపడింది. పుణెలో మాత్రం పచ్చికతో నిండిన వికెట్‌పై అనుభవరాహిత్య లంక బౌలింగ్‌ను ధీటుగా ఎదుర్కోలేకపోయింది. టీ20 ప్రపంచ కప్‌ ఫేవరెట్‌ భారతకు ఈ పరాజయం ఓ మేలు కొలుపు. తొలి టీ20లో ధోనీసేన అలవోకగా గెలుస్తుందని భావించా. అయితే లంక యువ పేసర్లు రజిత, షనక నిప్పులు చెరగడంతో పటిష్ట భారత బ్యాటింగ్‌ లైనప్‌ కకావికలమైంది. వీర్దిదరూ చెరో 3 వికెట్లతో భారతను కోలుకోలేని దెబ్బతీశారని గుర్తు చేశారు. 
 
అశ్విన మాత్రం ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో మెరిశాడు. ఒత్తిడిలో రాణించినప్పుడే ఆటగాళ్ల సత్తా తెలుస్తుంది. ఇక రాంచీలో ఫ్లాట్‌ పిచపై ధోనీసేన పుంజుకునే చాన్స ఉంది. ఇక్కడ లంకకు కష్టాలు తప్పకపోవచ్చు. కానీ ఆ జట్టును తక్కువగా అంచనావేస్తే మరోసారి మూల్యం చెల్లించక తప్పదు. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో మెరుగ్గా ఉన్న లంక గట్టిపోటీ ఇచ్చే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. 

Share this Story:

Follow Webdunia telugu