Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వరల్డ్ కప్‌లో విరాట్ కోహ్లీ చెత్త ప్రదర్శన : అయినా నిలకడగా ర్యాంకు!

వరల్డ్ కప్‌లో విరాట్ కోహ్లీ చెత్త ప్రదర్శన : అయినా నిలకడగా ర్యాంకు!
, మంగళవారం, 31 మార్చి 2015 (15:10 IST)
ఇటీవల ముగిసిన వరల్డ్ కప్ టోర్నీలో భారత క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అత్యంత చెత్త ప్రదర్శన కనపరిచినప్పటికీ.. ఐసీసీ తాజాగా ప్రకటించిన ర్యాంకుల పట్టికలో కోహ్లీ ర్యాంకు మాత్రం స్థిరంగానే ఉంది. అదేసమయంలో భారతజట్టు ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మల స్థానాలు మాత్రం మెరుగుపడ్డాయి. 
 
తాజాగా వెల్లడించిన ర్యాంకుల పట్టికలో ధావన్ 6వ స్థానంలో నిలవగా, రోహిత్ ఏకంగా ఏడు స్థానాలు మెరుగుపర్చుకున్నాడు. దాంతో ఆస్ట్రేలియా ఆటగాడు మైకేల్ క్లార్క్, పాకిస్థాన్ ఆటగాడు మిస్బాతో కలసి రోహిత్ 12వ ర్యాంకులో నిలిచాడు. ఇక విరాట్ కోహ్లీ తన నాలుగో స్థానంలోనే ఉన్నాడు. ఇటు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 8వ స్థానంలో నిలిచాడు. దక్షిణాఫ్రికా కెప్టెన్ ఏబీ డివిలియర్స్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 
 
బౌలర్ల విభాగంలో ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్ మొదటిసారి తొలిస్థానం దక్కించుకున్నాడు. భారత్ బౌలర్ ఉమేష్ యాదవ్ 16 స్థానాలు ఎగబాకి 18వ ర్యాంకు సాధించుకున్నాడు. వరల్డ్ కప్ విజేత ఆస్ట్రేలియా జట్టు నంబర్ వన్ స్థానంలో ఉంది. భారతజట్టు రెండో స్థానంలో కొనసాగుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu