Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అభిమానులు ఆరాధిస్తారు. ప్రత్యర్థులు గజగజా వణుకుతారు.. దటీజ్ కోహ్లీ

అత్యంత అణకువ కలిగిన కుటుంబ నేపథ్యం నుంచి ఆధునిక క్రికెట్ సూపర్ స్టార్‌గా ఎదిగిన విరాట్ కోహ్లీ జీవితం నిలువెల్లా ఉత్తేజమే. తండ్రి చనిపోయినప్పుడు ఎదురైన సంక్లిష్ట పరిస్థితుల నుంచి జాతీయ క్రికెట్ టీమ్‌లో తన ముద్ర వేయడానికి ప్రయత్నించడం, తర్వాత కెప్టెన్‌

అభిమానులు ఆరాధిస్తారు. ప్రత్యర్థులు గజగజా వణుకుతారు.. దటీజ్ కోహ్లీ
హైదరాబాద్ , ఆదివారం, 5 ఫిబ్రవరి 2017 (08:45 IST)
అత్యంత అణకువ కలిగిన కుటుంబ నేపథ్యం నుంచి ఆధునిక క్రికెట్ సూపర్ స్టార్‌గా ఎదిగిన విరాట్ కోహ్లీ జీవితం నిలువెల్లా ఉత్తేజమే. తండ్రి చనిపోయినప్పుడు ఎదురైన సంక్లిష్ట పరిస్థితుల నుంచి జాతీయ క్రికెట్ టీమ్‌లో తన ముద్ర వేయడానికి ప్రయత్నించడం, తర్వాత కెప్టెన్‌గా మారే వరకు కోహ్లీ చేసిన ప్రయత్నాలు సాధారణ విజయం కాదు. 28 ఏళ్ల ఈ యువకుడు జాతి మొత్తం గుండె చప్పుడయ్యాడు. అభిమానులు ఆరాధిస్తారు. ప్రత్యర్థులు గజగజా వణుకుతారు. ఇటీవలే ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగిన మూడు ఫార్మాట్లలో ఘనవిజయం సాధించిన ఈ ఆటగాడిని 2016లో 2595 పరుగులు చేసినందుకు గాను విజ్డెన్ క్రికెటర్స్ అల్మనాక్ కవర్ స్టార్‌గా ప్రచురించింది. 
 
18 ఏళ్ల వయస్సులో తండ్రి 2006లో గుండెపోటుతో చనిపోయినప్పుడు ఏం చేయాలో తెలీని కోహ్లీ తన జీవితానికి గమ్యాన్ని ఎంచుకోవడంలో అసాధారణమైన పట్టుదల చూపించాడు. భారత్ కోసం ఆడాలనే చిరకాల స్వప్నం కోసం అలుపెరుగని కృషి, పోాటం చేశాడు. ఆ కఠిన శ్రమే త్వరలోనే అతడికి టీమండియా జెర్సీ ధరించే అవకాశం కల్పించింది. ఈ రోజు అభిమానులు అతడి విజయాలను చూసి జేజేలు పలుకుతున్నారు.అదే సమయంలో ప్రపంచంలో ఏ క్రికెట్ టీమ్‌లోని బౌలర్ అయినా సరే అతడికి బౌలింగ్ వేయాలంటేనే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుంటున్నారు. 
 
చివరికి ఆధునిక క్రికెట్‌ను సుదీర్ఘ కాలం శాసించిన ఆసీస్ టీమ్‌ను కూడా దాని సహజ క్రీడ అయిన స్లెడ్జింగ్‌ను మాని, మాటలతో రెచ్చగొట్టడం మాని అతడిని ఔట్ చేయడం మీదే దృష్టి పెట్టాల్సిందిగా సూచనలు చే్స్తున్నారంటేనే కోహ్లీ వేసిన ముద్ర మనకు బోధపడుతుంది.
 
కోహ్లీ సాధించిన ప్రత్యేక విజయాలు 
వన్డే ఇంటర్నేషనల్ లో వేగంగా 6 వేల పరుగులు చేసిన తొలి ఆటగాడు. 
2011-12 - అర్జున అవార్డు
2013 -  అర్జున అవార్డు
2013  ఆస్ట్రోలియాపై 52 బంతుల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన ఆడగాడు
2016 మూడు ఫార్మాట్లలో కెప్టెన్‌ కావటం

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వారణాసిలో వేదిక్ క్రికెట్.. సంస్కృతంలో కామెంటరీ..కొత్త మజా