Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సచిన్ రికార్డులను కోహ్లీనే బ్రేక్ చేస్తాడు: సౌరవ్ గంగూలీ

సచిన్ రికార్డులను కోహ్లీనే బ్రేక్ చేస్తాడు: సౌరవ్ గంగూలీ
, శుక్రవారం, 27 ఫిబ్రవరి 2015 (15:56 IST)
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సాధించిన అనేక రికార్డులను బద్ధలు కొట్టాలంటే.. ప్రస్తుతానికి కోహ్లీకే అవకాశాలు అధికంగా ఉన్నాయని మాజీ కెప్టెన్ గంగూలీ అభిప్రాయపడ్డాడు.

అత్యధిక సెంచరీల రికార్డు (49 సెంచరీలు)ను కోహ్లీ అధిగమిస్తాడన్నట్టుగానే గంగూలీ వ్యాఖ్యానించాడు. ఇప్పటికే, వన్డేల్లో కోహ్లీ 22 సెంచరీలు కొట్టిన సంగతిని గుర్తు చేసిన ఆయన, ఎంతలేదన్నా మరో 10 సంవత్సరాల పాటు కోహ్లీ ఆడతాడు కాబట్టి ఏం జరుగుతుందో చూద్దామని అన్నాడు. 
 
ప్రతి ఒక్కరి రికార్డు కూడా బ్రేక్ అవుతుందని, అయితే సచిన్ నెలకొల్పిన వంద సెంచరీల రికార్డు మాత్రం సురక్షితమని, అది చిరకాలం నిలిచివుంటుందని వివరించాడు. దక్షిణాఫ్రికాను భారత్ 130 పరుగుల తేడాతో ఓడిస్తుందని ఎవరూ ఊహించలేదని, ఈ మ్యాచ్ తరువాత భారత్ ఫామ్ ఇతర జట్లకు తెలిసిందన్నాడు. 
 
నాకౌట్ దశలో ఎవరు నిలుస్తారో చెప్పడం కష్టమని గంగూలీ అన్నారు. ఆస్ట్రేలియా, భారత్ ఫైనల్ మ్యాచ్ ఆడవచ్చని భావిస్తున్నట్టు తెలిపారు. టాస్ ఓడిపోతే ధోనీ జట్టు ఎలా ఆడుతుందనేది చూడాలని అన్నాడు.

Share this Story:

Follow Webdunia telugu