Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కోహ్లి-అనుష్కల ప్రేమాయణం పెటాకులవడానికి సల్మాన్ కారణమా...? ఎలాగబ్బా...?

కోహ్లి-అనుష్కల ప్రేమాయణం పెటాకులవడానికి సల్మాన్ కారణమా...? ఎలాగబ్బా...?
, శనివారం, 13 ఫిబ్రవరి 2016 (20:44 IST)
కొందరంటే ఇంకొందరికి గిట్టదు. బాలీవుడ్ విషయానికి వస్తే సల్మాన్ ఖాన్ పేరు చెబితే... ఆయన సరసన ఛాన్స్ అంటే, పెదాలు బిగిస్తాడనే నానుడి ఉంది. పైగా ఆయనకు పలు హీరోయిన్లతో ఎఫైర్లు తక్కువేమీ కాదు. అందువల్ల ఈ కండలవీరుడితో సినిమా అంటే... హీరోయిన్ల బాయ్ ఫ్రెండులు బెంబేలెత్తిపోతుంటారు. అలాగే స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి కూడా మూతి బిగించాడట. 
 
ఇంతకీ కోహ్లి-అనుష్క ప్రేమాయణానికి సల్మాన్ ఖాన్ ఎలా అడ్డుపడ్డాడంటే... అగ్రహీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న 'సుల్తాన్' సినిమాలో అనుష్క శర్మకు కథానాయికగా నటించే అవకాశం కలిగింది. తనకు వచ్చిన అవకాశాన్ని కోహ్లితో చెప్పగా వద్దంటే వద్దన్నాడట.  'సినిమాల సంగతి పక్కనపెట్టి కుటుంబాన్ని ఎలా నడపాలో నేర్చుకో' అని హెచ్చరించాడట. 
 
ఐతే అనుష్క శర్మ మాత్రం అదేమీ పట్టించుకోకుండా సల్మాన్ ఖాన్ సుల్తాన్ చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. దాంతో కోహ్లీకి అరికాల మంట నెత్తికెక్కిందని బాలీవుడ్ జనం చెప్పుకుంటున్నారు. కోహ్లి-అనుష్కలు ఈ విషయంలో ఘర్షణ పడ్డారనీ, తన కెరీర్ అగ్రస్థానంలో ఉన్నప్పుడు కోహ్లితో తనకెందుకొచ్చిన పితలాటకం అని టాటా చెప్పేసినట్లు బాలీవుడ్ జనం చెప్పుకుంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu