Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సచిన్ ఆసక్తికర ట్వీట్.. నెటిజన్ల నుంచి భారీ స్పందన: ఫోటోలకు లైక్స్ వెల్లువ

సచిన్ ఆసక్తికర ట్వీట్.. నెటిజన్ల నుంచి భారీ స్పందన: ఫోటోలకు లైక్స్ వెల్లువ
, సోమవారం, 13 జులై 2015 (12:36 IST)
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆసక్తికర ట్వీట్‌కు నెటిజన్స్ నుంచి భారీ స్పందన వెల్లువెత్తుతున్నాయి. చిట్ట చివరి బస్సు మిస్సయ్యాను.. ఎవరైనా లిఫ్టివ్వండి ప్లీజ్ అని క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కోరితే, ఎన్ని కార్లు క్యూ కడతాయో కదా? ప్రస్తుతం సచిన్ నుంచి వచ్చిన అలాంటి అభ్యర్థనే ట్విట్టర్లో చక్కర్లు కొడుతోంది. 
 
వింబుల్డన్ టోర్నీని ఆస్వాదించేందుకు భార్య అంజలితో కలిసి ఇంగ్లండ్ వెళ్లిన సచిన్ మస్తుగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా స్పందించిన సచిన్ టెండూల్కర్... ''నేనిప్పుడు గ్రేట్ హాస్లేలో ఉన్నా. చివరి బస్సు మిస్ అయ్యాను. ఎవరైనా లిఫ్ట్ ఇవ్వగలరా?'' అంటూ పోస్ట్ చేశాడు. 
 
ఆ పోస్ట్‌లో సచిన్ చిలిపి వ్యాఖ్యలు చేశాడు. అంతేకాక రోడ్డు పక్కగా చెట్టుకు ఆనుకుని, బెంచీపై కూర్చుని అటుగా ఏవైనా వాహనాలు వస్తాయా? అంటూ ఎదురుచూస్తున్నట్లుగా ఉన్న తన ఫొటోలను ఆ ట్వీట్‌కు జతచేశాడు. చిలిపిగానే కాక ఆసక్తికరంగా ఉన్న ఈ ట్వీట్‌కు నెటిజన్ల నుంచి భారీ స్పందన వస్తోంది. ఫోటోలకు భారీ స్థాయిలో లైక్స్ వస్తున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu