Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సచిన్ నాకు దేవుడిలాంటి వాడు.. నాకు రోల్ మోడల్: ధోనీ

సచిన్ నాకు దేవుడిలాంటి వాడు.. నాకు రోల్ మోడల్: ధోనీ
, బుధవారం, 2 సెప్టెంబరు 2015 (11:32 IST)
టీమిండియా కూల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తనకు రోల్ మోడల్ ఎవరో చెప్పేశారు. టీమిండియా వన్డే, టీ20 జట్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అమెరికా పర్యటనలో భాగంగా మంగళవారం భారతరత్న సచిన్ టెండూల్కర్ పై ప్రశంసల జల్లు కురిపించాడు. తన రోల్ మోడల్ సచినేనని అతడు వ్యాఖ్యానించాడు. 
 
ఆట పట్ల నిబద్ధత, అంకితభావం చూపే సచిన్ తనకు నిజంగానే రోల్ మోడల్ అని ధోనీ వెల్లడించాడు. అంతేకాకుండా సచిన్ తనకు దేవుడిలాంటి వాడని కూడా మహీ పేర్కొన్నాడు. తనకే కాక అందరికీ కూడా సచిన్ స్ఫూర్తి ప్రదాత అని కూడా చెప్పాడు. ‘‘సచిన్ ఆట చూస్తూనే పెరిగాం. మా అందరికీ అతడు దేవుడితో సమానం’’ అని ధోనీ తెలిపాడు.
 
2011 ప్రపంచకప్‌ను సచిన్ కోసమే కాకుండా.. యావత్తు భారత దేశం కోసం సాధించామని, ఇప్పటివరకు రికార్డుల పంట పండించిన సచిన్ టెండూల్కర్ ఖాతాలో వరల్డ్ కప్ కూడా చేరడం ఎంతో సంతోషాన్నిచ్చిందని ధోనీ చెప్పాడు.

Share this Story:

Follow Webdunia telugu