Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చెన్నైలో సందడి చేసిన సచిన్: రెహ్మాన్‌తో సరదా ప్రశ్నలు

చెన్నైలో సందడి చేసిన సచిన్: రెహ్మాన్‌తో సరదా ప్రశ్నలు
, ఆదివారం, 23 ఆగస్టు 2015 (11:45 IST)
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ రమేశ్ టెండూల్కర్.. చెన్నైలో సందడి చేశారు. ఓ ట్రస్టుకు చెందిన కార్యక్రమంలో పాల్గొనేందుకు చెన్నైకి వెళ్లిన సచిన్.. ఆ తర్వాత నేరుగా కోడంబాక్కంలోని ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ్మార్ ఇంటికి వెళ్లారు. 
 
తనకు స్నేహితుడైన రెహ్మాన్‌తో సచిన్ కాసేపు ముచ్చటించారు. సంగీతం రూపకల్పన, పాటలకు బాణీలు కట్టే తీరుపై రెహ్మాన్‌కు సరదా ప్రశ్నలు సంధించారు. దీంతో అక్కడికక్కడే కొన్ని బాణీలు కట్టిన రెహ్మాన్ తన మిత్రుడి ఉబలాటాన్ని తీర్చాడు. 
 
ఎమ్మారెఫ్ పేస్ ఫౌండేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు చెన్నై వచ్చిన సచిన్ టెండూల్కర్.. ఆపై ఓ తమిళనాడు జట్టుకు ఆటలో గల మెలకువలను తెలియజేశారు. ఇకపోతే.. చెన్నైలోని ఎం.ఎ. చిదంబరం స్టేడియంలో పది టెస్టులాడిన సచిన్ టెండూల్కర్.. ఐదు సెంచరీలతో 970 పరుగులు సాధించి 88.18 యావరేజ్‌ను కలిగివున్నాడు. 

Share this Story:

Follow Webdunia telugu