Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గవాస్కర్ 4నెలల సంపాదన ఎంతో తెలుసా? అక్షరాలా రూ.1.90కోట్లు!

గవాస్కర్ 4నెలల సంపాదన ఎంతో తెలుసా? అక్షరాలా రూ.1.90కోట్లు!
, మంగళవారం, 28 ఏప్రియల్ 2015 (15:54 IST)
భారత మాజీ ఓపెనర్, మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ నాలుగు నెలల కాలంలో ఎంత సంపాదిస్తాడు? భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ)కి అతను పంపిన లేఖ ప్రకారం ఈ మొత్తం అక్షరాలా 1.90 కోట్ల రూపాయలని తేలింది. ఆరో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ వ్యవహారం తెరపైకి రావడం, పలు కేసులు నమోదు కావడంతో విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు అప్పటి బోర్డు అధ్యక్షుడు శ్రీనివాసన్‌ను పదవీ బాధ్యతల నుంచి తప్పించింది. తీర్పు వెలువడే వరకూ బోర్డు వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని స్పష్టం చేసింది.
 
ఈలోగా ఏడో ఐపిఎల్ వచ్చేసింది. ఆ టోర్నీ పూర్తయ్యే వరకూ బిసిసిఐ అధ్యక్షుడిగా గవాస్కర్‌ను సుప్రీం కోర్టు నియమించింది. కోర్టు ఆదేశాల ప్రకారం గత ఏడాది మార్చి 28న అతను బిసిసిఐకి తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాడు. అతని పర్యవేక్షణలోనే ఏడో ఐపిఎల్ సజావుగా సాగింది.

ఐపిఎల్ పూర్తయిన తర్వాత తన పరిస్థితి, బోర్డులో తన హోదా ఏమిటో తెలపాలని సుప్రీం కోర్టును కోరాడు. ఆ అభ్యర్థనను పరిశీలించిన కోర్టు జూలై 18న అతనిని రిలీవ్ చేస్తున్నట్టు ప్రకటించింది. అంటే, గత ఏడాది మార్చి 28 నుంచి జూలై 18 వరకూ, అంటే సుమారు నాలుగు నెలలు అతను బిసిసిఐ అధ్యక్షుడిగా వ్యవహరించాడు. 
 
కామెంటేటర్‌గానేగాక, ఇతరత్రా పనులను కూడా మానుకోవాల్సి వస్తుంది కాబట్టి ‘తగినంత’ పారితోషికాన్ని అతనికి చెల్లించాలని బిసిసిఐని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో తాను బోర్డు అధ్యక్షుడిగా వ్యవహరించిన కాలానికి 1.90 కోట్ల రూపాయలను పారితోషికంగా చెల్లించాలని గవాస్కర్ బోర్డుకు లేఖ రాశాడని తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu