Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

న్యూజిలాండ్ వికెట్లు డౌన్... 28 ఓవర్లలో 183/4

న్యూజిలాండ్ వికెట్లు డౌన్... 28 ఓవర్లలో 183/4
, మంగళవారం, 24 మార్చి 2015 (14:25 IST)
ఆక్లాండ్ వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ 2015 తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో 43 ఓవర్లలో 298 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ స్కోర్ బోర్డు ఆరంభంలో ఉరకలెత్తినప్పటికీ.. మెక్ కల్లమ్ ఔట్ తర్వాత స్కోరు బోర్డు నెమ్మదించింది. ఫలితంగా ప్రస్తుతం 28 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది.
 
అంతకుముందు 298 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ జట్టు.. కెప్టెన్ బ్రెండన్ మెక్‌కల్లమ్ దెబ్బకు దక్షిణాఫ్రికా బౌలర్లు చేష్టలుడిగిపోయారు. కేవలం 22 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. దీంతో ఆ జట్టు 6.1 ఓవర్లలో 71 పరుగులు చేసింది. ఈ క్రమంలో తన వ్యక్తిగత స్కోరు 59 వద్ద మెక్ కల్లమ్ మోర్కెల్ బౌలింగ్‌లో స్టెయిన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన విలియమ్సన్ కేవలం ఆరు పరుగులకే ఔట్ కావడంతో కివీస్ జట్టు తన రెండో వికెట్‌ను  81 పరుగుల వద్ద 8.5 ఓవర్లలో కోల్పోయింది. ఆ తర్వాత గుప్తిల్ 34 పరుగుల వద్ద రనౌట్ కాగా, టేలర్ 30 పరుగులు, విలియమ్సన్ 6 చొప్పున పరుగులు చేశారు. 
 
అంతకుముందు తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా జట్టు 43 ఓవర్లలో 281 పరుగులు చేసిన విషయం తెల్సిందే. అయితే, డక్ వర్త్ లూయిస్ సిద్ధాంతం మేరకు న్యూజిలాండ్ జట్టుకు 298 పరుగులను టార్గెట్‌గా నిర్ధేశించారు. ఈ మ్యాచ్‌కు వరుణుడు అడ్డుపడిన విషయం తెల్సిందే. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ నెగ్గిన సఫారీ జట్టు బ్యాటింగ్‌కు మొగ్గు చూపింది. అయితే, సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌‌లో 38 ఓవర్ల అనంతరం వర్షం పడటంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. మ్యాచ్ ఆగిపోయే సమయానికి దక్షిణాఫ్రికా 38 ఓవర్లలో 3 వికెట్లకు 216 పరుగులు చేసింది. డు ప్లెసిస్ 82, కెప్టెన్ ఏబీ డివిలియర్స్ 60 పరుగులతో క్రీజులో ఉన్నారు. 
 
అంతకుముందు ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన సఫారీలు తొలుత బ్యాటింగ్ చేపట్టిన సఫారీ జట్టుకు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సొంతగడ్డపై కివీస్ జట్టు ప్రభావం చూపింది. పేస్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై న్యూజిలాండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు విసిరారు. దీంతో, దక్షిణాఫ్రికా రెండో వికెట్ కోల్పోయింది. కివీస్ లెఫ్టార్మ్ సీమర్ ట్రెంట్ బౌల్ట్ నిప్పులు చెరిగే బంతులతో సఫారీ టాపార్డర్‌కు పరీక్ష పెట్టాడు. 
 
బౌల్ట్ ధాటికి మరో ఓపెనర్ డి కాక్ (14) కూడా వెనుదిరిగాడు. సౌథీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అంతకుముందు, 10 పరుగులు చేసిన ఓపెనర్ ఆమ్లా కూడా బౌల్ట్ బౌలింగ్‌లోనే అవుటయ్యాడు. ప్రస్తుతం 9 ఓవర్లు ముగిసేసరికి దక్షిణాఫ్రికా 2 వికెట్లకు 34 పరుగులు చేసింది. ఆ తర్వాత రస్సో కూడా తన వ్యక్తిగత స్కోరు 39 వద్ద ఆండర్సన్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. 
 
ఫలితంగా ఆ ప్రొటీస్ జట్టు 114 పరుగులకే కీలకమైన మూడు వికెట్లను కోల్పోయింది. అయితే, దక్షిణాఫ్రికా జట్టు కెప్టెన్ ఏబీ డివిలియర్స్ రంగప్రవేశంతో ఊపందుకుంది. డివిలియర్స్‌ డు ప్లెసిస్‌తో కలిసి ధాటిగా ఆడుతుండడంతో పరుగులు ధారాళంగా వచ్చాయి. ఫలితంగా వీరిద్దరు నాలుగో వికెట్‌కు ఇప్పటి వరకు 102 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇందులో ఏబీ డీవిలియర్స్ 60 పరుగులు చేయగా, ప్లెసిస్ 40 పరుగులు ఉన్నాయి. 
 
ఆ తర్వాత మైదానాన్ని పరిశీలించిన ఫీల్డ్ అంపైర్లు మ్యాచ్‌ను 43 ఓవర్లకు కుదించారు. ఆ వెంటనే మ్యాచ్ ప్రారంభమైంది. అయితే, జట్టు స్కోరు 217 వద్ద ఉండగా డు ప్లెసిస్ 82 పరుగుల వద్ద ఆండర్సన్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ఆ తర్వాత డీ విల్లియర్స్‌తో జత కలిసిన మిల్లర్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. కేవలం 18 బంతుల్లో ఆరు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 272 స్ట్రైక్ రేటుతో 49 పరుగులు చేశాడు. 
 
చివర్లో డుమ్నీ కూడా 4 బంతులు ఎందుర్కొని ఎనిమిది పరుగులు చేయగా, డి విల్లియర్స్ 65 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో ప్రొటీస్ జట్టు 43 ఓవర్లలో 6.53 రన్ రేట్‌తో ఐదు వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది. కివీస్ బౌలర్లలో ఆండర్సన్ మూడు వికెట్లు తీయగా, బోల్ట్ రెండు వికెట్లు తీశాడు. 

Share this Story:

Follow Webdunia telugu