Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బీసీసీఐని చూసి నేర్చుకోండి : వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు లారా చురక

బీసీసీఐని చూసి నేర్చుకోండి : వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు లారా చురక
, గురువారం, 28 మే 2015 (16:00 IST)
కొన్ని సంవత్సరాల పాటు జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించి, దేశానికి సేవలు అందించిన సీనియర్ క్రికెటర్‌కు ఎలాంటి మర్యాద ఇవ్వాలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)ను చూసి నేర్చుకోవాలంటూ వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు ఆ దేశ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా చురక అంటించారు. వెటరన్ బ్యాట్స్ మన్ శివనారాయణ్ చందర్ పాల్‌కు గౌరవంగా రిటైరయ్యే అవకాశం కల్పించకుండా, అవమానకర రీతిలో వ్యవహరిస్తోందంటూ బ్యాటింగ్ ఈ బ్యాటింగ్ దిగ్గజం బ్రయాన్ లారా క్రికెట్ బోర్డుపై మండిపడ్డారు. 
 
'సచిన్ టెండూల్కర్‌కు బీసీసీఐ ఎంత అద్భుతమైన ముగింపునిచ్చిందో చూడండి' అంటూ విండీస్ బోర్డుకు చురక అంటించాడు. ఏకంగా సచిన్ కోసం ఓ సిరీస్‌ను ఏర్పాటు చేసి, ఘనంగా వీడ్కోలు పలికారని గుర్తు చేశాడు. జట్టు కోసం విశేష సేవలు అందించిన చందర్ పాల్‌కు కూడా అదే రీతిలో వీడ్కోలు పలకడం అవసరమని ఈ స్టయిలిష్ లెఫ్ట్ హ్యాండర్ అభిప్రాయపడ్డాడు.
 
ఆస్ట్రేలియాతో సిరీస్‌కు తనను ఎంపిక చేస్తే, క్రికెట్ నుంచి సగౌరవంగా తప్పుకుంటానని చందర్ పాల్ చేసిన విజ్ఞప్తిని విండీస్ క్రికెట్ బోర్డు పట్టించుకోలేదని ఆయన మండిపడ్డారు. చివరకు శిక్షణా శిబిరానికి కూడా అతడిని ఎంపిక చేయకుండా పక్కనబెట్టింది. దీనిపై జట్టు కోచ్ ఫిల్ సిమ్మన్స్ కూడా నిస్సహాయత వ్యక్తం చేశాడు. 

Share this Story:

Follow Webdunia telugu