Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తడబడిన మైకేల్ క్లార్క్: సెక్స్-సక్సెస్‌ అంటూ నవ్వులు..

తడబడిన మైకేల్ క్లార్క్: సెక్స్-సక్సెస్‌ అంటూ నవ్వులు..
, గురువారం, 30 జులై 2015 (08:19 IST)
ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్ మైకేల్ క్లార్క్ మరోసారి నవ్వులు పూయించారు. యాషెస్‌లో మూడో టెస్టు ఆరంభానికి ముందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో క్లార్క్‌ మాట్లాడుతూ.. ‘మాకు ‘సెక్స్‌’ కావాలంటే.. లార్డ్స్‌ తరహాలో అన్ని రంగాల్లో రాణించాల’ని నోరు జారాడు. సెక్స్-సక్సెస్ విషయంలో తడబడ్డాడు. అంతలోనే నాలిక్కరచుకుని.. నా ఉద్దేశం ‘సక్సెస్‌’ అని సవరించుకున్నాడు. ఇలా సెక్స్‌-సక్సెస్‌ మిక్స్‌ అప్‌ గురించి గత అనుభవాన్ని క్లార్క్‌ సరదాగా గుర్తు చేసుకున్నాడు.
 
ఇదేవిధంగా మార్చిలో వరల్డ్‌ కప్‌ సందర్భంగా కూడా ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. కెప్టెన్సీని మళ్లీ దక్కించుకున్న తర్వాత సక్సెస్‌ను ఎలా ఎంజాయ్‌ చేస్తున్నారని అనబోయి... ఓ విలేకరి ‘సెక్స్‌’ను ఎలా ఎంజాయ్‌ చేస్తున్నారని ప్రశ్నించాడు. దీనికి ‘ఈ ప్రశ్న నా భార్యను అడగాల’ని క్లార్క్‌ నవ్వులు పూయించాడు. వరల్డ్ కప్ సందర్భంగా కెప్టెన్సీకి దూరంగా ఉన్న క్లార్క్.. యాషెస్ సిరీస్ ద్వారా కెప్టెన్సీని అందుపుచ్చుకున్నాడు. 

Share this Story:

Follow Webdunia telugu