Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మోకాలికి లండన్‌లో సర్జరీ...ఫొటో షేర్ చేసిన సచిన్

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ లండన్‌లోని ఒక ఆసుపత్రిలో చేరారు. తన మోకాలుకు సంబంధించిన చికిత్స కోసం ఆసుపత్రిలో చేరినట్లు సచిన్ తన ఫేస్‌బుక్ ఖాతాలో తెలిపారు. లండన్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో శస్త్రచ

మోకాలికి లండన్‌లో సర్జరీ...ఫొటో షేర్ చేసిన సచిన్
, గురువారం, 7 జులై 2016 (08:55 IST)
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ లండన్‌లోని ఒక ఆసుపత్రిలో చేరారు. తన మోకాలుకు సంబంధించిన చికిత్స కోసం ఆసుపత్రిలో చేరినట్లు సచిన్ తన ఫేస్‌బుక్ ఖాతాలో తెలిపారు. లండన్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో శస్త్రచికిత్స జరిగింది. ఆపరేషన్ అనంతరం సచిన్ మోకాలికి వైద్యులు బ్యాండేజ్ వేశారు. 

మోకాలికి ఆపరేషన్ జరిగిన విషయాన్ని తానే స్వయంగా ఫేస్‌బుక్‌లో వెల్లడించాడు. అంతేకాదు శస్త్రచికిత్స జరిగిన కాలికి సంబంధించిన ఫొటోను కూడా సచిన్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. గత కొద్దిరోజులుగా విదేశీ పర్యటనల్లో మాంచి ఊపుమీదున్నసచిన్ ''రిటైర్మెంట్‌ తర్వాత కూడా గాయాలు ఇబ్బంది పెడుతున్నాయి. అయితే అతి త్వరలో నేను కోలుకుని రోజువారి పనుల్లో నిమగ్నమవుతాననే నమ్మకం నాకుంది.

ప్రస్తుతం మోకాలికి ఆపరేషన్‌ జరగడంతో విశ్రాంతి తీసుకుంటున్నాను'' అని అభిమానులతో తన భావనలను పంచుకున్నాడు. నవంబరు, 2013లో ఆటకు వీడ్కోలు పలికిన సచిన్‌ అప్పటి నుంచి కుటుంబ సభ్యులతోనే ఎక్కువ సమయం కేటాయిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రికెట్ దేవుడికి ఆపరేషన్ అన్న విషయం తెలియగానే అభిమానులు షాక్ అయ్యారు. సచిన్ త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు సామాజిక మాధ్యమాలలో తమ కామెంట్లు పోస్ట్ చేశారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టెస్టు బ్యాట్ల విషయంలో నిబంధన విధించాలి.. ధోనీ బ్యాట్ సైజ్ మించకూడదంతే: పాంటింగ్