Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రవిశాస్త్రి పిచ్చోళ్ల ప్రపంచంలో బతుకుతున్నాడు: బెంగాల్ దాదా గంగూలీ

భారత క్రికెట్ జట్టు మాజీ డైరెక్టర్ రవిశాస్త్రిపై టీమిండియా సలహాదారు కమిటీ సభ్యుడు, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఫైర్ అయ్యాడు. రవిశాస్త్రి తనపై చేసిన వ్యాఖ్యలు బాధించాయని.. రవిశా

రవిశాస్త్రి పిచ్చోళ్ల ప్రపంచంలో బతుకుతున్నాడు: బెంగాల్ దాదా గంగూలీ
, గురువారం, 30 జూన్ 2016 (10:45 IST)
భారత క్రికెట్ జట్టు మాజీ డైరెక్టర్ రవిశాస్త్రిపై టీమిండియా సలహాదారు కమిటీ సభ్యుడు, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఫైర్ అయ్యాడు. రవిశాస్త్రి తనపై చేసిన వ్యాఖ్యలు బాధించాయని.. రవిశాస్త్రి పిచ్చోళ్ల ప్రపంచంలో బతుకుతున్నాడని తీవ్రంగా విరుచుకుపడ్డాడు. 
 
కోల్ కతాలో రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలపై బెంగాల్ దాదా మాట్లాడుతూ.. బీసీసీఐ అనుమతి తీసుకునే తాను క్యాబ్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ సమావేశానికి వెళ్లానని చెప్పుకొచ్చాడు. అంతేకానీ తనకు అప్పగించిన బాధ్యతలను వదిలించుకోవాలని అక్కడికెళ్లలేదని స్పష్టం చేశాడు.
 
తనపై లేనిపోని వ్యాఖ్యలు చేస్తున్న రవిశాస్త్రిపై గంగూలీ ఫైర్ అయ్యాడు. రవిశాస్త్రి టీమిండియా ప్రధాన కోచ్ పదవి కావాలనుకున్నప్పుడు హాలీడే పేరిట విదేశాలకు ఎందుకు వెళ్లాడని గంగూలీ ప్రశ్నించారు. వ్యక్తిగత విమర్శలతో ఉపయోగం లేదని గంగూలీ హితవు పలికాడు.
 
కాగా... ఇంటర్వ్యూ సమయంలో గంగూలీ అక్కడ లేకపోవడంతో.. గంగూలీకి తనతో వచ్చిన సమస్యేంటో అని ప్రముఖ పత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ ద్వారా రవిశాస్త్రి వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రియో ఒలింపిక్స్.. అథ్లెట్లకు అందుబాటులో భారతీయ వంటకాలు: గుప్తా క్లారిటీ