Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రియుడికి మద్దతుగా నిలిచిన అమ్మాయిని కుళ్లు జోకులతో వేధిస్తారా?

ప్రియుడికి మద్దతుగా నిలిచిన అమ్మాయిని కుళ్లు జోకులతో వేధిస్తారా?
, సోమవారం, 20 ఏప్రియల్ 2015 (18:29 IST)
భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ ప్రియురాలు, బాలీవుడ్ నటి అనుష్క శర్మకు సహచర బాలీవుడ్ నటి ప్రీతి జింతా అండగా నిలిచారు. ప్రియుడికి అండగా నిలిచిన అమ్మాయిని కుళ్ళుజోకులతో వేధిస్తారా అంటూ మండిపడింది. సెలబ్రిటీలను ఈ విధంగా బాధించడం అనైతికమని అభిప్రాయపడింది. 
 
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వేదికగా జరిగిన ప్రపంచ కప్ క్రికెట్ పోటీల సందర్భంగా కోహ్లీ వైఫల్యాలకు అనుష్కను బాధ్యురాలిని చేస్తూ అనేక మంది ఇష్టానుసారంగా విమర్శలకు దిగిన విషయం తెల్సిందే. ముఖ్యగా.. అనుష్క భారత్ ఆడే మ్యాచ్‌లకు హాజరు కావడం వల్లే కోహ్లీ ఏకాగ్రత తప్పిందని విశ్లేషించారు. దీనిపై కోహ్లీ, అనుష్క పెద్దగా స్పందించకున్నా, సీనియర్ నటి, పంజాబ్ ఫ్రాంచైజీ సహ యజమాని ప్రీతీ జింతా మాత్రం స్పందించింది. 
 
కోహ్లీ వైఫల్యాలకు అనుష్కను బాధ్యురాలిని చేస్తున్న విమర్శకులు, కోహ్లీ విజయాలకు కూడా ఆమెను బాధ్యురాలిగా పరిగణించాలని సలహా ఇచ్చింది. అందుకే, కోహ్లీ ఎప్పుడైనా రాణించి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిస్తే, అతని తరపున అనుష్క వెళ్లి ఆ అవార్డు తీసుకోవాలని గట్టి సలహా ఇచ్చింది. కష్టాల్లో ఉన్న ప్రేమికుడికి మద్దతుగా నిలిచిన అమ్మాయిని కుళ్లు జోకులతో వేధించడం వింతగా ఉందని ప్రీతి జింతా ఆవేదన వ్యక్తం చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu